Telangana: జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటన.. ఎప్పటి నుంచి.. ఎప్పటి వరకు అంటే..?
ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. హాట్ సమ్మర్‌తో అలసి పోయిన విద్యార్థులకు సర్కార్ చల్లటి కబురు చెప్పింది. తెలంగాణ సర్కార్ జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్. హాట్ సమ్మర్‌తో అలసి పోయిన విద్యార్థులకు సర్కార్ చల్లటి కబురు చెప్పింది. తెలంగాణ సర్కార్ జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది. మే 20వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతాయని వెల్లడించింది. అలాగే జూన్ 15 నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభమవుతాయని, జులై 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఈ ఆదేశాలను పాటించాలని సూచించింది. ఈ ఆదేశాలను తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు కూడా పాటించాలని విద్యా శాఖ వెల్లడించింది. విద్యాశాఖ నిబంధనలను పాటించని ఆయా కాలేజీల పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
వచ్చే విద్యాసంత్సరం (2022-23)కు సంబంధించి తెలంగాణ జూనియర్ కాలేజీలకు పరీక్షలు, సంక్రాంతి సెలవులు, కాలేజీల ప్రారంభానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు (TSBIE) విడుదల చేసింది. తాజా క్యాలెండర్ ప్రకారం మొత్తం పని దినాలు 220గా ఉన్నట్లు తెలుస్తోంది.
సెకండియర్ కాలేజీలు జూన్ 15 నుంచి ప్రారంభమవుతాయి
ఫస్టియర్ కాలేజీలు జులై 1 నుంచి ప్రారంభమవుతాయి.
దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి 9 వరకు
హాఫ్ ఇయర్ పరీక్షలు నవంబర్ 21 నుంచి 26 వరకు
సంక్రాంతి సెలవులు 2023, జనవరి 13 నుంచి 15 వరకు
ప్రీ ఫైనల్ పరీక్షలు 2023, ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు
ప్రాక్టికల్ పరీక్షలు 2023, ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు
ఫైనల్ పరీక్షలు 2023, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు
వేసవి సెలవులు 2023, ఏప్రిల్ 1 నుంచి మే 31
అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు 2023, మే చివరి వారంలో
2023-24 అకడమిక్ ఇయర్‌కు కాలేజీల రీఓపెన్ 2023, జూన్