TS SSC Exams 2022: మే 23 నుంచి సీసీ కెమెరాల పర్యవేక్షణలో తెలంగాణ టెన్త్ పబ్లిక్ పరీక్షలు.. ఇక ఆ పప్పులుడకవ్!
తెలంగాణ పదో తరగతి పబ్లిక పరీక్షలు మే 23 నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రేటర్‌లో దాదాపు 2.15 లక్షల మంది పరీక్షలు రాయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ..
Telangana SSC Board exams should be conducted under close watch of CCTV cameras: తెలంగాణ పదో తరగతి పబ్లిక పరీక్షలు మే 23 నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రేటర్‌లో దాదాపు 2.15 లక్షల మంది పరీక్షలు రాయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ నడుం బిగించింది. ఇతర రాష్ర్టాల్లో చోటుచేసుకున్న ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. గతంలో నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు భిన్నంగా ఈసారి అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రతీ అంశాన్ని రికార్డు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. సీసీ కెమెరాల వినియోగంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇప్పటికే జిల్లాస్థాయి అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అన్ని సెంటర్లలోనూ సీసీ కెమెరాల ఏర్పాట్లు పూర్తయ్యాయా? అవి సక్రమంగా పనిచేస్తున్నాయా.. లేదా..? అనే వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు పంపించారు. ఈ క్రమంలో పదో తరగతి వార్షిక పరీక్షలను పురస్కరించుకుని గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 941 సెంటర్లను ఏర్పాటు చేశారు. 604 చోట్ల మాత్రమే సీసీ కెమెరాలున్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా 337 చోట్ల ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. సీసీ కెమెరాలు లేని సెంటర్లలో అద్దెకు తీసుకుని తక్షణమే ఏర్పాటు చేయాలని యాజమాన్యాలను ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
జిల్లా విద్యాశాఖాధికారులకు సీసీ టీవీ ఫుటేజీ.. ప్రశ్నాపత్రాల లీకేజీ, మాస్ కాపీయింగ్‌ను అరికట్టడంలో భాగంగా ఈసారి పదో తరగతి పరీక్షల్లో సీసీ కెమెరాలను తప్పనిసరి చేయడం ఆసక్తికరంగా మారింది. కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా చీఫ్ సూపరింటెండెంట్ గదిలో ఉంచడంతోపాటు ప్రశ్నాపత్రాలను ఓపెన్ చేస్తున్నప్పుడు, సమాధాన పత్రాలను తిరిగి సీల్ చేస్తున్నప్పుడు ప్రతీ ఒక్కటి రికార్డు చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాను మెయిన్ కెమెరా మానిటర్‌కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్ల మానిటర్లతో జతచేయనున్నారు. పరీక్ష జరిగిన ఆరు రోజుల సీసీ టీవీ ఫుటేజీలను చీఫ్ సూపరింటెండెంట్లు చివరి రోజున సీల్డ్ కవర్‌లో భద్రపరిచి జిల్లా విద్యాశాఖాధికారులకు అందజేయనున్నారు.
మే 23 నుంచి పరీక్షలు ప్రారంభం తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు (TS 10th class 2022) గురువారం (మే 12) విడుదలయ్యాయి. కాగా మే 23 నుంచి జూన్ 1 వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పరీక్షలకు అరగంట సమయాన్ని అదనంగా కేటాయించిన విషయం తెలిసిందే. అంటే ఉదయం 9 గంటల 30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిముషాల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: