NEET UG 2022: నీట్‌ యూజీ 2022 రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ మరోమారు పొడిగింపు.. పరీక్ష ఎప్పుడంటే..

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG-2022) ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని మరోసారి పొడిగిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం మే 15 రాత్రి 9 గంటలకు ముగిసిన దరఖాస్తు గడువును..

NEET UG 2022: నీట్‌ యూజీ 2022 రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ మరోమారు పొడిగింపు.. పరీక్ష ఎప్పుడంటే..
Neet Ug 2022
Follow us
Srilakshmi C

|

Updated on: May 16, 2022 | 4:00 PM

NEET UG 2022 Registration Last Date: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG-2022) ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని మరోసారి పొడిగిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం మే 15 రాత్రి 9 గంటలకు ముగిసిన దరఖాస్తు గడువును మే 20 వరకు పొడిగించింది. కాగా గతంలో నీట్‌ యూజీ దరఖాస్తు ప్రక్రియ మే 6తో ముగియనుండగా దానిని మే 15 వరకు పొడిగించారు. ఇక తాజాగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (AFMS) అభ్యర్ధనల మేరకు మరోసారి రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగించడం జరిగింది.. విద్యార్ధుల అభ్యర్ధన మేరకు చివరి తేదీని పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులెవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 1600, జనరల్, ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ. 1500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్ధులకు రూ. 900లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ అండర్ గ్రాడ్యుయేట్ 2022 ప్రవేశ పరీక్ష జూలై 17న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌ పద్ధతిలో జరగనుంది. ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్ కోర్సులు, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, వెటర్నరీ కోర్సులు వంటి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. NEET UG 2022కి సంబంధించి సందేహాలు, సమాచారం కోసం ఫోన్‌ నెంబర్‌ 011-40759000ను సంప్రదించవచ్చు. లేదా neet@nta.ac.inకు ఈమెయిల్ చేయవచ్చు.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

Also Read:

TS SSC Exams 2022: మే 23 నుంచి సీసీ కెమెరాల పర్యవేక్షణలో తెలంగాణ టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు.. ఇక ఆ పప్పులుడకవ్‌!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే