NEET PG 2022 Exam Date: నీట్ పీజీ 2022 అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET PG 2022 Admit Cards) అడ్మిట్ కార్డులను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) మే 14న విడుదల చేసింది. నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు..
NEET PG 2022 Admit Card download: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET PG 2022 Admit Cards) అడ్మిట్ కార్డులను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) మే 14న విడుదల చేసింది. నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ nbe.edu.in లేదా natboard.edu.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులో ఫొటో ప్రింట్‌రాని విద్యార్ధులకు సంబంధించిన ఫొటోను neetpg@natboard.edu.in ఈమెయిల్ ఐడీకి పంపవల్సిందిగా తెల్పుతూ.. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
కాగా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నీట్ పీజీ 2022 పరీక్ష యథాతదంగా మే 21న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల వరకు కంప్యూటర్ ఆధారిత మోడ్‌లో జరగనుంది. పరీక్ష వాయిదా వేయాలంటూ దేశ వ్యాప్తంగా మెడికల్ విద్యార్థులు కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నా అందుకు కేంద్రం ససేమిరా అంది. తాజాగా సుప్రీం కోర్టులో కూడా నీట్ పీజీ 2022 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ దఖలైంది. దీనిని విచారించిన అత్యు్న్నత ధర్మాసనం పరీక్షను వాయిదా వేయడం వల్ల విద్యార్ధుల్లో గందరగోళం, అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉందని తీర్పునిచ్చింది. దీంతో పరీక్ష ముందు ప్రకటించిన తేదీ (మే 21) ప్రకారంగానే జరగనుంది. పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు లేదని ఇప్పటికే మెడికల్ బోర్డు కూడా స్పష్టం చేసింది.
NEET PG 2022 అడ్మిట్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ nbe.edu.inను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్‌పేజీలో కనిపించే ‘NEET PG’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్, అవసరమైని ఇతర వివరాలతో లాగిన్ అవ్వాలి.
- వెంటనే స్క్రీన్ పై NEET PG Admit Card 2022 ఓపెన్ అవుతుంది.
- అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ ఔట్ తీసుకోవాలి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: