AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్ల ఏనుగు అల్లరితో కీపర్‌ అవస్థలు..వీడియో చూస్తే కడుపు చెక్కలే..అల్లరే అల్లరి

చిన్నపిల్లల అల్లరి చేష్టలు అందరినీ ఆకట్టుకుంటాయి. పిల్లతో గడిపినంత సేపు ఎలాంటి కష్టమైన ఇట్టే మర్చిపోయి గడిపేస్తారు పెద్దలు. కొన్ని కొన్ని సందర్భాల్లో పెంపుడు జంతువులు చేసే అల్లరి కూడా అందరికీ నచ్చుతుంది.

పిల్ల ఏనుగు అల్లరితో కీపర్‌ అవస్థలు..వీడియో చూస్తే కడుపు చెక్కలే..అల్లరే అల్లరి
Baby Elephant
Jyothi Gadda
|

Updated on: May 16, 2022 | 4:21 PM

Share

చిన్నపిల్లల అల్లరి చేష్టలు అందరినీ ఆకట్టుకుంటాయి. పిల్లతో గడిపినంత సేపు ఎలాంటి కష్టమైన ఇట్టే మర్చిపోయి గడిపేస్తారు పెద్దలు. కొన్ని కొన్ని సందర్భాల్లో పెంపుడు జంతువులు చేసే అల్లరి కూడా అందరికీ నచ్చుతుంది. ఇంట్లో ఉండే కుక్కపిల్లలు, పిల్లి పిల్లలు వారి యజమానులతో చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఇక ఇంట్లోని వారంతా ఎటో బయటకు వెళ్తున్నారంటే అప్పుడు చూడాలి అవి చేసే హంగామా అంతాఇంతా కాదు. చిన్నపిల్లలు కదా తమను కూడా తీసుకువెళ్లాలన్నట్టుగా ఎలాగైతే మారం చేస్తారో..అచ్చం పెంపుడు జంతువులు కూడా చేస్తాయి. వెంటపడి బయటకు వెళ్లకుండా చేస్తుంటాయి. అలాంటప్పుడు వాటినుంచి తప్పించుకుని, దొంగచాటుగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే, కేవలం కుక్కలు, పిల్లులే కాదు..ఏనుగులు కూడా తమ కావటి వారితో అల్లరిపడుతుంటాయి. అవి చేసే తుంటరి పనులతో యజమానులను ముప్పుతిప్పలు పెడుతుంటాయి. అచ్చం ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ పిల్ల ఏనుగు దాని కీపర్‌ని నిద్రపోనివ్వకుండా చేసి రచ్చ రచ్చ చేసింది. ఏనుగు పిల్ల హంగామాతో కీపర్‌ కూడా జతకట్టాడు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్‌గా మారిన ఈ వీడయోలో ముందుగా చుట్టు కంచెవేసిన ఉంచిన ప్రదేశం నుంచి ఓ పిల్ల ఏనుగు ఎలా తప్పించుకుందో చూడొచ్చు..ఒక్కో కాలు జాగ్రత్తగా బయటపెడుతూ..మెల్లిగా కంచెను దాటేస్తుంది. ఆ పక్కనే ఓ బెడ్‌ ఏర్పాటు చేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు దాని కీపర్‌. కంచెలోంచి బయటపడ్డ ఏనుగు పిల్ల అతను నిద్రిస్తున్న బెడ్‌వద్దకు చేరింది. కాళ్లతో అతన్ని తట్టి లేపుతున్నట్టుగా వెంటపడింది. అతనిని నిద్రలేపి పక్కలోంచి బయటకు నెట్టడానికి ప్రయత్నిస్తుంది. అయితే, ఏనుగు పిల్ల ఎంత ప్రయత్నించిన అతడు పరుపు మీదనుంచి కిందకు దిగలేదు..అటు ఇటూ ఊపేస్తూ ఆ ఏనుగు పిల్ల చివరకు అటుపక్కనే ఉన్న ఆకుల కుప్పలో పడింది. కానీ, ఆ వెంటనే లేస్తుంది. మరోసారి అతని పక్క వద్దకు వచ్చి అల్లరి పెట్టింది. కీపర్‌ దాని అల్లరిని కట్టి పెట్టి తనతో పాటు పరుపు మీద పడుకోబెట్టుకుంటాడు..దాంతో ఆ పిల్ల ఏనుగు కూడా హాయిగా నిద్రపోతుంది. తాగుబోతు వ్యక్తి ఎలాంటి రచ్చ చేస్తాడో ఈ పిల్ల ఏనుగు సైతం అంతే స్థాయిలో హంగామా సృష్టించింది. ఇంత చేసినా కీపర్‌ ఏ మాత్రం ఆగ్రహించకుండా దానిని మచ్చిక చేసుకున్న విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంత చక్కటి వీడియోని ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి డాక్టర్‌ సామ్రాట్‌ గౌడ్‌ షేర్‌ చేశారు. ఈ ఫన్నీ వీడియోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుంది…ఇలాంటి వీడియోలతో సంతోషకరమైన మానసిక స్థితి కలుగుతుందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మాటల్లో చెప్తే కాదు..వీడియో చూస్తే మీరు కూడా తెగ ఎంజాయ్‌ చేస్తారు..

Viral video : భారత్‌కు రోబోల అవసరమే లేదు..! దేశంలో ఇలాంటి వ్యక్తులుండగా,..ఇతడు మనిషా..? లేక యంత్రమా.?

North Korea: కరోనా కేసులే లేవన్న కిమ్‌ కింగ్‌డమ్‌లో లక్షకు పైగా పాజిటివ్స్‌..పరిస్థితి చెప్పలేమంటున్న నిపుణులు

Viral video : విష సర్పంతో చిన్నదాని ఆటలు..కసితో రగిలిపోయిన స్నేక్‌ ఏం చేసిందో చూస్తే షాక్‌ అవుతారు..

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో