Purple Cabbage Benefits: పర్పుల్ క్యాబేజీతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే షాక్ అవుతారు!
క్యాబేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్యాబేజీ గురించి అందరికీ తెలుసు. క్యాబేజీ బ్రాసికా కుటుంబానికి చెందినది. క్యాబేజీలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా క్యాబేజీలో నీటి శాతం అధికంగా ఉంటుంది. సమ్మర్‌లో క్యాబేజీని తినడం చాలా బెస్ట్. దీన్ని సలాడ్స్‌లో అయినా.. కర్రీలా అయినా ప్రిపేర్ చేసుకుని తినవచ్చు. ఈ క్యాబేజీలో అనేక రకాలు ఉంటాయి. అందులో పర్పుల్ కూడా ఒకటి. దీన్ని రెడ్ క్యాబేజీ అని కూడా అంటారు. పర్పుల్ క్యాబేజీ కూడా ఆరోగ్యానికి..

క్యాబేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్యాబేజీ గురించి అందరికీ తెలుసు. క్యాబేజీ బ్రాసికా కుటుంబానికి చెందినది. క్యాబేజీలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా క్యాబేజీలో నీటి శాతం అధికంగా ఉంటుంది. సమ్మర్‌లో క్యాబేజీని తినడం చాలా బెస్ట్. దీన్ని సలాడ్స్‌లో అయినా.. కర్రీలా అయినా ప్రిపేర్ చేసుకుని తినవచ్చు. ఈ క్యాబేజీలో అనేక రకాలు ఉంటాయి. అందులో పర్పుల్ కూడా ఒకటి. దీన్ని రెడ్ క్యాబేజీ అని కూడా అంటారు. పర్పుల్ క్యాబేజీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, ఫోలేట్, ప్రోటీన్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభ్యమవుతాయి. ఇన్ని పోషక విలువలు ఉన్న పర్పుల్ క్యాబేజీ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
హైపర్ టెన్షన్‌ను కంట్రోల్ చేస్తుంది:
పర్పుల్ క్యాబేజీలో కేలరీలు అనేవి తక్కువగా ఉంటాయి. అలాగే డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం.. శరీరంలోని నాడులను నియంత్రించి.. హైపర్ టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. రక్తంలోని పోటాషియం.. గుండె వేగాన్ని క్రమబద్దీకరించడంలో హెల్ప్ చేస్తుంది.
చర్మానికి మంచిది:
పర్పుల్ క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి సహాయ పడతాయి. చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి.. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
ఈ పర్పుల్ క్యాబేజీలో ఉండే విటమిన్ సి.. శరీరంలోని ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇన్ ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. క్యాబేజీలో విటమిన్లు ఎ, సిలు రోగ నిరోధక శక్తిని మెరుగు పరుస్తాయి. శరీరంలో ఉండే విష పదార్థాలను, మలినాలను బయటకు పంపేందుకు హెల్ప్ చేస్తాయి. విటమిన్ ఎ కంటి చూపు మెరుగు పరిచేందుకు తోడ్పడుతుంది.
ఎముకలు బలంగా ఉంటాయి:
పర్పుల్ క్యాబేజీని తినడం వల్ల.. ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. పర్పుల్ క్యాబేజీలో ఉండే విటమిన్ కె, పొటాషియం ఎముకలు, కండరాల పని తీరును మెరుగు పరిచేందుకు సహాయ పడుతుంది. అంతే కాకుండా కీళ్ల నొప్పులు, వాపులను నివారించేందుకు తోడ్పడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.








