Get Rid of Mosquitoes: దోమల బెడదకు చెక్ పెట్టాలా.. ఈ చిట్కాలు ప్రయత్నించండి!
ఒక్కోసారి దోమలు బెడద ఎక్కువగా ఉంటుంది. దోమలు కేవలం చలి కాలంలోనే కాదు అన్ని సీజన్లలోనూ ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ ప్రస్తుతం ఇప్పుడు వేసవి కాలం వచ్చేస్తుంది. ఈ సీజన్‌లో ఎక్కువగా కరెంట్ పోతూ ఉంటుంది. ఈ సమయంలో దోమల కారణంగా మరింత ఇబ్బంది పడుతూ ఉంటారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా కుడుతూ ఉంటాయి. దీని వల్ల ప్రాణాంతకమైన డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు..
Updated on: Feb 28, 2024 | 7:11 PM

ఒక్కోసారి దోమలు బెడద ఎక్కువగా ఉంటుంది. దోమలు కేవలం చలి కాలంలోనే కాదు అన్ని సీజన్లలోనూ ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ ప్రస్తుతం ఇప్పుడు వేసవి కాలం వచ్చేస్తుంది. ఈ సీజన్‌లో ఎక్కువగా కరెంట్ పోతూ ఉంటుంది. ఈ సమయంలో దోమల కారణంగా మరింత ఇబ్బంది పడుతూ ఉంటారు.

రాత్రి, పగలు అనే తేడా లేకుండా కుడుతూ ఉంటాయి. దీని వల్ల ప్రాణాంతకమైన డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే.. దోమల బెడద నుంచి ఉపశమనం పొందవచ్చు. దోమల బెడద వదిలించుకోవడానికి చాలా మంది దోమల చక్రాలు, రీఫిల్స్ పెడుతూ ఉంటారు.

కానీ వాటి ద్వారా వచ్చే గాలిని పీల్చడం వల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలా కాకుండా నేచురల్‌గానే దోమల బెడదలను వదిలించుకోవచ్చు. అందుకోసం నిమ్మ కాయ, కర్పూరం, లవంగాలు, వత్తులు, ఆవ నూనె కావాలి.

ముందుగా ఒక చిన్న నిమ్మకాయ తీసుకోండి. తల భాగంలో పైన కొద్దిగా కట్ చేయండి. ఆ తర్వాత ఇందులో ఉండే గుజ్జు అంతా తీసేయండి. ఆ తర్వాత నిమ్మ కాయలో లవంగాలు వేసి, ఆవనూనె వేయండి. ఇప్పుడు వత్తి వేసి.. దీపం వెలిగించండి.

ఆ తర్వాత ఇంట్లో తలుపు అన్నీ వేసి ఉంచండి. దీంతో ఏ మూల ఉన్న దోమలు అయినా ఈ వాసను ఊపిరి ఆడక చచ్చిపోతాయి. ఈ దీపం నుంచి వచ్చే పొగ వాసన.. దోమలకు అస్సలు పడదు. ఇంట్లో దోమలు పోయాక.. బయట పెట్టండి.




