AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acidity Problem: అసిడిటీ సమస్యా.. ఈ హోమ్ రెమిడీస్‌తో బైబై చెప్పండి..

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చాలా మంది ఫేస్ చేసే సమస్యల్లో అసిడిటీ కూడా ఒకటి. ఏవి పడితే అవి.. ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల ఈ అసిడిటీ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా ఆయిల్‌తో చేసే ఆహారాలు, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, మసాలాలు, కారాలు, పుల్లని పదార్థాలను ఎక్కువగా అధికంగా తీసుకోవడం ఈ సమస్య అనేది వస్తుంది. దీని వల్ల కడుపులో తేన్పులు, ఉబ్బరం వస్తుంది. ఈ అసడిటీ సమస్య ఒక్కసారి వచ్చిందంటే.. అంత సులభంగా తగ్గదు. దీన్ని తగ్గించుకోవడానికి చాలా రకాల..

Acidity Problem: అసిడిటీ సమస్యా.. ఈ హోమ్ రెమిడీస్‌తో బైబై చెప్పండి..
Acidity
Chinni Enni
|

Updated on: Mar 04, 2024 | 4:53 PM

Share

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చాలా మంది ఫేస్ చేసే సమస్యల్లో అసిడిటీ కూడా ఒకటి. ఏవి పడితే అవి.. ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల ఈ అసిడిటీ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా ఆయిల్‌తో చేసే ఆహారాలు, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, మసాలాలు, కారాలు, పుల్లని పదార్థాలను ఎక్కువగా అధికంగా తీసుకోవడం ఈ సమస్య అనేది వస్తుంది. దీని వల్ల కడుపులో తేన్పులు, ఉబ్బరం వస్తుంది. ఈ అసడిటీ సమస్య ఒక్కసారి వచ్చిందంటే.. అంత సులభంగా తగ్గదు. దీన్ని తగ్గించుకోవడానికి చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నా.. వాటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అంతే కాకుండా ఈ అసిడిటీ సమస్య నుంచి బయట పడేందుకు కొన్ని రకాల హోమ్ రెమిడీస్ కూడా ఉన్నాయి. వాటితో ఈ సమస్య నుంచి సులభంగా బయట పడొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అరటి పండు:

అసిడిటీ సమస్యతో బాధ పడేవారు భోజనం చేసిన వెంటనే అరటి పండు తినడం చాలా మంచిది. ఇలా తినడం వల్ల అసిడిటీ నుంచి ఉపశమనం పొందుతారు. బనానా అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస సమస్యకు చెక్ పెడుతుంది. దీని తినడం వల్ల చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు. కొన్ని రోజుల్లోనే మీకు మంచి ప్రభావం కనిపిస్తుంది.

అల్లం నీరు:

ఎప్పుడైనా కడుపులో అజీర్తి చేసినప్పుడు మీకు అనిపిస్తే.. వెంటనే అల్లాన్ని దంచి.. నీటిలో బాగా కలిపి.. ఆ నీటిని తాగాలి. ఇది అసిడిటీ సమస్యను తగ్గించడంలో ప్రభావంతంగా పని చేస్తుంది. అసిడిటీ ఉన్నవారు ప్రతి రోజూ ఉదయం ఇలా చేయడం చాలా బెటర్. అల్లాన్ని వేసి నీటిని కూడా మరిగించి, అందులో నిమ్మరసం, తేనె కలుపుకుని కూడా తాగవచ్చు.

ఇవి కూడా చదవండి

సోంపు నీరు:

సోంపు తినడం వల్ల జీర్ణ శక్తి అనేది బాగా పెరుగుతుంది. అంతే కాకుండా కడుపు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అసిడిటీ సమస్యతో బాధ పడేవారు సోంపు తినడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. కడుపులో యాసిడ్‌ను చల్లార్చడంలో సోంపు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది. భోజనం చేశాక సోంపును నేరుగా తినవచ్చు. లేదా సోంపు నీటిని తీసుకున్నా చాలా మంచిది.

మజ్జిగ:

అసిడిటీ సమస్యను తగ్గించడంలో మజ్జిగ కూడా ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. అంతే కాదు వేడి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. భోజనం చేసిన తర్వాత మజ్జిగ తాగతే.. అసిడిటీ సమస్య నుంచి రిలీఫ్ పొందొచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us