వీరికి నిమ్మకాయ నీరు విషంతో సమానం.. తాగి ప్రమాదంలో పడొద్దు!

Samatha

21 April 2026

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఎక్కువగా నిమ్మకాయ నీరు తాగడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు. ఇది అలసట, ఎండ వేడి నుంచి కాపాడుతుంది.

సమ్మర్

చాలా మంది నిమ్మకాయ నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది అనుకుంటారు. దీంతో ప్రతి ఒక్కరూ దీనిని తాగడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు.

నిమ్మకాయ నీళ్లు

అయితే నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలతో బాధపడే వారు అస్సలే వీటిని తాగకూడదంట. వారు ఎవరు అంటే?

అనారోగ్య సమ్యలు

ఎవరు అయితే గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం , కడుపు సమస్యలతో బాధపడుతున్నారో వారు నిమ్మకాయ నీరు తాగకూడదంట.

గ్యాస్ట్రిక్

ఇందులో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన దీనిని తాగడం వలన అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి.

సిట్రిక్ యాసిడ్

అలాగే పళ్ల సమస్యలు,  పళ్ల సున్నితత్వం ఉన్నవారు కూడా ఎట్టి పరిస్థితుల్లో నిమ్మకాయ రసం తాగకూడదు.

దంతాల సమస్యలు

ముఖ్యంగా మూత్ర పిండాల సమస్యతో బాధపడే వారు వీలైనంత వరకు వైద్యుడి సలహా తీసుకొని నిమ్మరసం తాగడం మంచిది.

మూత్ర పిండాల సమస్యలు

కొంత మందికి పదే పదే తల తిరగడం వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. అయితే అలాంటి వారు నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంట.

తల తిరగడం