AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: ఏంటి.. తలనొప్పికి ఇన్ని కారణాలున్నాయా.? అవేంటంటే…

తలనొప్పి సర్వసాధారణమైన సమస్య. మనలో చాలా మంది కచ్చితంగా ఈ సమ్యను ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటారు. అయితే సర్వసాధారణమైన తలనొప్పి కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే మనకు వచ్చే తల నొప్పుల్లో చాలా రకాలున్నాయని మీకు తెలుసా.?

Lifestyle: ఏంటి.. తలనొప్పికి ఇన్ని కారణాలున్నాయా.? అవేంటంటే...
Headache
Narender Vaitla
|

Updated on: Mar 04, 2024 | 5:08 PM

Share

తలనొప్పి సర్వసాధారణమైన సమస్య. మనలో చాలా మంది కచ్చితంగా ఈ సమ్యను ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఉంటారు. అయితే సర్వసాధారణమైన తలనొప్పి కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అయితే మనకు వచ్చే తల నొప్పుల్లో చాలా రకాలున్నాయని మీకు తెలుసా.? ఇంతకీ ఏ రకమైన తలనొప్పిని ఎలాంటి లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

* ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ప్రజలు చాలా బిజీగా మారిపోయారు. వృత్తి మొదలు వ్యక్తిగత జీవితం వరకు ఒత్తిడితో చిత్తవుతున్నారు. దీంతో తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఒత్తిడి కారణంగా కూడా తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* తలనొప్పికి మరో కారణం మైగ్రేన్‌. ఈ సమస్యబారిన పడిన వారిలో విపరీతమైన తలనొప్పి వేధిస్తుంటుంది. ఏదైనా కాంతి పడినప్పుడు లేదా శబ్ధం, కొన్ని రకాల వాసనల వల్ల తలనొప్పి ప్రారంభమవుతుంది.

* కంటి చికాకుతో వచ్చే తలనొప్పిని క్లస్టర్‌ తలనొప్పిగా చెబుతుంటారు. ఇది చాలా తీవ్రమైన తలనొప్పిని కలిగిస్తుంది. కళ్లు ఎర్రగా మారి, కంటి నుంచి నీళ్లు వస్తాయి.

* చాలా మంది ఎదుర్కొనే తల నొప్పుల్లో సైనస్‌ కారణంగా వచ్చే తలనొప్పి కూడా ఒకటి. ముక్కులో ఏర్పడే సమస్య కారణంగా తలనొప్పికి దారి తీస్తుంది. ముక్కు కారడంతో పాటు తలనొప్పి ఉంటే అది సైనస్‌ కారణంగా వచ్చిందని భావించాలి.

* ఇక రాత్రి మద్యం ఎక్కువగా సేవించిన వారికి ఉదయం పూట వచ్చే తలనొప్పిని హ్యాంగోవర్‌ తలనొప్పిగా పిలుస్తుంటారు. సాధారణంగా మద్యం సేవించినప్పుడు శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో వీపరీతమైన తలనొప్పి వేధిస్తుంటుంది.

* కంటప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ ఎక్కువగా ఉపయోగించే వారికి కూడా తల నొప్పి వేధిస్తుంటుంది. ఇలాంటి వారు కళ్ల జోళ్లను ఉపయోగించడం వల్ల ఆ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us