AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెస్ట్రన్ స్టైల్‌లో ప్రపోజ్ చేస్తానన్న ప్రియురాలు.. ఆశతో వెళ్లిన ప్రియుడు.. అసలు ట్విస్ట్ ఇదే!

కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సినిమా తరహాలో సాగిన ఈ 'డెడ్లీ లవ్ స్టోరీ' అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. నమ్మిన ప్రేమే కాలయముడై కబళించిన హృదయ విదారక ఘటన ఇది. బెంగళూరులోని అంజనానగర్‌లో మంగళవారం జరిగింది.

వెస్ట్రన్ స్టైల్‌లో ప్రపోజ్ చేస్తానన్న ప్రియురాలు.. ఆశతో వెళ్లిన ప్రియుడు.. అసలు ట్విస్ట్ ఇదే!
Man Burns Alive
Balaraju Goud
|

Updated on: Apr 22, 2026 | 8:34 AM

Share

కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సినిమా తరహాలో సాగిన ఈ ‘డెడ్లీ లవ్ స్టోరీ’ అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. నమ్మిన ప్రేమే కాలయముడై కబళించిన హృదయ విదారక ఘటన ఇది. బెంగళూరులోని అంజనానగర్‌లో మంగళవారం (ఏప్రిల్ 21) 27 ఏళ్ల కిరణ్ అనే యువకుడు తన ప్రియురాలి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. వెస్ట్రన్ స్టైల్‌లో సర్ ప్రైజ్ ఇస్తానని నమ్మించి, అతడిని సజీవ దహనం చేసిన తీరు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

రాజాజీనగర్‌లోని ఒక టెలికాం స్టోర్‌లో పని చేసే కిరణ్, అదే చోట పనిచేసే ప్రేమ అనే యువతితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. మంగళవారం మధ్యాహ్నం పని నిమిత్తం బయటకు వెళ్లిన వీరిద్దరూ గద్దె ఖాన్ ప్రాంతంలోని ప్రేమ నివాసానికి చేరుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి ఆమె తన పథకాన్ని అమలు చేసింది. “నీకు వెస్ట్రన్ స్టైల్‌లో ప్రపోజ్ చేస్తాను” అని కిరణ్‌ను నమ్మించింది. ఆటలో భాగమని చెబుతూ కిరణ్ చేతులు, కాళ్లు తాడుతో గట్టిగా బంధించి, కళ్లకు గంతలు కట్టింది. కిరణ్ నిస్సహాయ స్థితిలో ఉండగా, ముందే సిద్ధం చేసుకున్న కిరోసిన్‌ను అతడిపై పోసి నిప్పంటించింది. తీవ్రమైన మంటల్లో చిక్కుకున్న కిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కిరణ్ ఇటీవల తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని, దూరం పెడుతున్నాడని ప్రేమ మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే అతడిపై కక్ష పెంచుకుని, ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకుంది. కిరోసిన్ ముందుగానే తెచ్చి పెట్టుకోవడం, నిప్పంటించే దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేయడం వంటి అంశాలు ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీసీపీ డి.ఎల్. నాగేష్, ఏసీపీ అశోక్ సందర్శించారు. నిందితురాలు ప్రేమను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. “ప్రేమ ముసుగులో ఇంతటి క్రూరత్వానికి ఒడిగట్టడం ఆందోళనకరం. కేసు నమోదు చేశాం, తదుపరి విచారణ కొనసాగుతోంది.” అని డీసీపీ డి.ఎల్. నాగేష్ వెల్లడించారు.ఈ ఘటన ప్రేమ పేరుతో జరుగుతున్న ఉన్మాదాలకు నిదర్శనంగా నిలిచింది. ఒక యువకుడి ప్రాణం పోవడమే కాకుండా, రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us