AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వామ్మో.. తలకు బలంగా తగిలిన బంతి.. కోపంతో బ్యాటర్ ఏం చేశాడంటే..?

West Indies Championship: వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. లీవార్డ్ ఐలాండ్స్, ట్రినిడాడ్, టొబాగో మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పిచ్ ప్రవర్తన ఆటగాళ్ల ప్రాణాల మీదకు తెచ్చింది. బంతి అనూహ్యంగా ఎగిరి బ్యాటర్ తలకు బలంగా తగలడంతో, మైదానంలో ఉద్రిక్తత నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది.

Video: వామ్మో.. తలకు బలంగా తగిలిన బంతి.. కోపంతో బ్యాటర్ ఏం చేశాడంటే..?
Leeward Is Vs Trinidad Tobago Video
Venkata Chari
|

Updated on: Apr 22, 2026 | 8:42 AM

Share

Leeward Is vs Trinidad & Tobago: క్రికెట్ మ్యాచ్‌లు సాధారణంగా వర్షం వల్లనో లేదా వెలుతురు లేకపోవడం వల్లనో ఆగిపోవడం మనం చూస్తుంటాం. కానీ, వెస్టిండీస్‌లోని నార్త్ సౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పరిస్థితి వేరు. ఇక్కడ ప్రకృతి వైపరీత్యం కాదు, పిచ్ తయారీలోని లోపం ఆటగాళ్లను భయభ్రాంతులకు గురిచేసింది. లీవార్డ్ ఐలాండ్స్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో, ట్రినిడాడ్ వేగవంతమైన బౌలర్ జేడెన్ సీల్స్ వేసిన బంతి ఆట గమనాన్ని మార్చేసింది.

హెల్మెట్‌పై బలంగా తగిలిన బంతి..

లీవార్డ్ బ్యాటర్ జెరీమియా లూయిస్ క్రీజులో ఉన్నప్పుడు, జేడెన్ సీల్స్ వేసిన ఒక సాధారణ బంతి పిచ్‌పై పడి ఊహించని విధంగా ఎగిరింది. అది నేరుగా లూయిస్ తలకు (హెల్మెట్‌కు) బలంగా తగిలింది. దెబ్బ తగలగానే లూయిస్ నొప్పితో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. తన ప్రాణానికి ముప్పు వాటిల్లిందని గ్రహించిన అతను, తీవ్ర ఆగ్రహంతో తన హెల్మెట్‌ను తీసి కాలితో బలంగా తన్నాడు. అదృష్టవశాత్తూ అతనికి పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, ఆ పిచ్ ఎంత ప్రమాదకరంగా ఉందో ఈ ఘటన నిరూపించింది.

బౌలర్ల ఆధిపత్యం.. పిచ్ ప్రతాపం..

ఈ మ్యాచ్ ఆరంభం నుంచి పిచ్ బౌలర్లకు విపరీతంగా సహకరించింది. మొదటి ఇన్నింగ్స్‌లో లీవార్డ్ ఐలాండ్స్ కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. దీనికి సమాధానంగా ట్రినిడాడ్ జట్టు 175 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో లీవార్డ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసిన తరుణంలో ఈ ప్రమాదకర ఘటన జరిగింది. జేడెన్ సీల్స్ అప్పటికే 7 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అయితే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నిర్ణయం, విమర్శలు..

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉండాల్సిన పిచ్ ఇలా ప్రాణాంతకంగా మారడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ కావడంతో, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పిచ్ తయారీపై వివరణ ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆట కంటే ఆటగాళ్ల ప్రాణాలు ముఖ్యమని భావించిన అధికారులు, మ్యాచ్‌ను రద్దు చేసి సరైన నిర్ణయం తీసుకున్నారని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us