Womens T20 World Cup : ఒకే రోజు ఇటు భారత్.. అటు పాకిస్తాన్ ప్లేయర్స్ అద్భుతం.. ప్రపంచ క్రికెట్‌లో అరుదైన ఘనత
Womens T20 World Cup : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో షెఫాలీ వర్మ, ఫాతిమా సనా అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించారు. ఒకే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో పాటు 3 వికెట్లు తీసిన ప్రపంచంలోని నాలుగో, మూడో మహిళా క్రికెటర్లుగా చరిత్రలో నిలిచారు.

Womens T20 World Cup : మహిళల క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ దేశాలకు చెందిన ఇద్దరు యువ మహిళా క్రికెటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భాగంగా జూన్ 17వ తేదీన జరిగిన మ్యాచ్‌లు సరికొత్త రికార్డులకు వేదికయ్యాయి. భారత స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ, పాకిస్తాన్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా తమ అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ రికార్డు బుక్స్‌లో తమ పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం నలుగురు మహిళా క్రికెటర్లకు మాత్రమే సాధ్యమైన ఒక రేర్ క్లబ్‌లో వీరు చోటు సంపాదించారు.
నెదర్లాండ్స్‌పై షెఫాలీ వర్మ విశ్వరూపం
జూన్ 17న నెదర్లాండ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్ షెఫాలీ వర్మ మైదానంలో బౌండరీల వర్షం కురిపించింది. మొదట బ్యాటింగ్‌లో కేవలం 38 బంతుల్లోనే 55 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ మ్యాజిక్ చేస్తూ ప్రత్యర్థి జట్టుకు చెందిన 3 కీలక వికెట్లను పడగొట్టింది. ఈ అద్భుతమైన ప్రదర్శనతో మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (50+) బాది, కనీసం 3 వికెట్లు పడగొట్టిన ప్రపంచపు మూడవ క్రికెటర్‌గా షెఫాలీ వర్మ నిలిచింది. భారతదేశం తరఫున ఈ అరుదైన ఘనత సాధించిన మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది.
సౌతాఫ్రికాపై చెలరేగిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా
భారత్ మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే.. అదే రోజు జరిగిన మరో మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు సౌతాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో పాక్ లేడీ కెప్టెన్ ఫాతిమా సనా కూడా నెక్స్ట్ లెవెల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది. ఆమె కూడా బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించి సరిగ్గా 55 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలింగ్ చేతబట్టి సౌతాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేస్తూ 3 వికెట్లు పడగొట్టింది. ఈ అల్ట్రా రేర్ ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో టీ20 వరల్డ్ కప్‌లో ఒకే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ, 3 వికెట్లు తీసిన ప్రపంచపు నాల్గవ క్రికెటర్‌గా, పాకిస్తాన్ తరఫున తొలి క్రికెటర్‌గా ఫాతిమా సనా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.
ప్రపంచంలో కేవలం నలుగురికే సాధ్యమైన రికార్డు
మహిళల టీ20 ప్రపంచకప్ సుదీర్ఘ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 50కి పైగా పరుగులు చేసి, 3 వికెట్లు తీయడం అనేది అత్యంత కష్టమైన టాస్క్. షెఫాలీ వర్మ, ఫాతిమా సనా కంటే ముందు ప్రపంచ క్రికెట్‌లో కేవలం ఇద్దరు మహిళా ఆటగాళ్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. వారిలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్ మొదటి స్థానంలో ఉండగా, సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ సున్ లూయిస్ రెండో స్థానంలో ఉన్నారు. ఇప్పుడు వీరి సరసన భారత్ నుంచి షెఫాలీ, పాకిస్తాన్ నుంచి ఫాతిమా చేరడంతో ఈ స్పెషల్ క్లబ్ సభ్యుల సంఖ్య నాలుగుకు చేరింది. ఒకే రోజు ఆసియా ఖండానికి చెందిన ఇద్దరు ప్లేయర్స్ ఈ రికార్డు కొట్టడం విశేషం.
