AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: న్యుమోనియాతో అక్క మరణం.. చిన్ననాటి ఫొటోలు షేర్ చేస్తూ టాలీవుడ్ డైరెక్టర్ ఎమోషనల్

తన అక్కను గుర్తు చేసుకుంటూ ఈ టాలీవుడ్ డైరెక్టర్ షేర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు, సినీ ప్రముఖులు కామెంట్ల రూపంలో ఆయనకు ధైర్యం చెబుతున్నారు. అలాగే డైరెక్టర్ అక్క ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.

Tollywood: న్యుమోనియాతో అక్క మరణం.. చిన్ననాటి ఫొటోలు షేర్ చేస్తూ టాలీవుడ్ డైరెక్టర్ ఎమోషనల్
Chiranjeevi
Basha Shek
|

Updated on: Aug 02, 2026 | 3:31 PM

Share

ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ సోదరి జ్యోతి సుంకర న్యుమోనియాతో పోరాడుతూ కొన్ని రోజుల క్రితమే కన్నుమూశారు. సుమారు 14 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స అందించినా ఆమె కోలుకోలేకపోయారు. వైద్యుల ప్రయత్నాలు ఫలించక ఆమె కన్నుమూయడంతో మెహర్ రమేష్ తో పాటు ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో అక్క మరణంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన మెహర్ రమేష్ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. అక్కతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ బ్లాక్ అండ్ ఫొటోల్లో మెహర్ రమేష్, ఆయన సోదరి క మెహర్ జ్యోతి సుంకరతో పాటు వారి మామయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. దీంతో పాటు కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలిచిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నాగబాబు ఫొటోలను కూడా మెహర్ రమేష్ ఇందులో పోస్ట్ చేశారు. తమ కష్ట సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘నా జీవితంలో అత్యంత క్లిష్ట సమయంలో మా కుటుంబానికి ధైర్యం చెప్పిన బంధువులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, అభిమానుల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. అక్క జ్ఞాపకాలు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతాయి. ఆమె మా పట్ల చూపించిన ప్రేమ, ఆప్యాయత జీవితాంతం వెంట ఉంటాయి’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చారు మెహర్ రమేష్.

ఇవి కూడా చదవండి

కాగా, మెహర్ జ్యోతి సుంకర 14 రోజులు పాటు వైరల్ న్యుమోనియాతో పోరాడుతూ కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి మెహర్ రమేష్‌ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మెహర్ రమేష్. కాగా కన్నడలో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన మెహర్ రమేష్ బిల్లా, కంత్రి, శక్తి, షాడో, భోళా శంకర్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించారు.

టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జపాన్‌తో భారత్ ప్రత్యేకంగా క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడుతోంది?
జపాన్‌తో భారత్ ప్రత్యేకంగా క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడుతోంది?
మల్లెపూల పల్లకి సాంగ్‌లానే మరో పాపులర్ పాట..
మల్లెపూల పల్లకి సాంగ్‌లానే మరో పాపులర్ పాట..
పెరిగిన చికెన్ ధరలు.. అదే బాటలో కోడి గుడ్లు కూడా..
పెరిగిన చికెన్ ధరలు.. అదే బాటలో కోడి గుడ్లు కూడా..
ప్రతి రోజూ ఇది ఒక గిన్నెడు తింటే.. దెబ్బకు డయాబెటిస్ జారుకుంటాది
ప్రతి రోజూ ఇది ఒక గిన్నెడు తింటే.. దెబ్బకు డయాబెటిస్ జారుకుంటాది
'5 సార్లు మెయిన్స్.. 3 ఇంటర్వ్యూ.. 6వ ప్రయత్నంలో IPS అయ్యాడు'
'5 సార్లు మెయిన్స్.. 3 ఇంటర్వ్యూ.. 6వ ప్రయత్నంలో IPS అయ్యాడు'
తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో గ్యాస్, అజీర్తి
తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో గ్యాస్, అజీర్తి
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..