AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మల్లెపూల పల్లకి సాంగ్‌లానే మరో పాపులర్ పాట.. మరోసారి థియేటర్స్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం

ప్రస్తుతం టాలీవుడ్‌లో భక్తి కంటెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. కథలో భావోద్వేగాలను, భక్తి అంశాలను మేళవిస్తూ తెరకెక్కుతున్న సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా భక్తి గీతాలు థియేటర్లలో ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తూ, సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి .

మల్లెపూల పల్లకి సాంగ్‌లానే మరో పాపులర్ పాట.. మరోసారి థియేటర్స్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం
Folk Song
Rajeev Rayala
|

Updated on: Sep 20, 2026 | 4:38 PM

Share

ఇటీవల విడుదలైన ‘ఇరుముడి’ చిత్రంలోనూ ఇదే తరహా డివోషనల్ టచ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్ కథకు భక్తి అంశాలను జోడించడం సినిమాకు మరింత బలాన్ని తీసుకొచ్చిందనే టాక్ వినిపించింది. ఇక ఈ సినిమాలోని ‘మల్లెపూల పల్లకి’ పాటకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో పాపులర్ భక్తి గీతం వెండితెరపై కొత్త రూపంలో సందడి చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అదే ‘రఘుకుల తిలకా రారా’. శ్రీరాముడి గొప్పతనాన్ని, భక్తి భావాన్ని ప్రతిబింబించేలా రూపొందిన ‘రఘుకుల తిలకా రారా’ పాటకు ఇప్పటికే మంచి ఆదరణ ఉంది. ఈ పాటను మరోసారి ప్రేక్షకుల ముందుకు కొత్త తరహాలో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

ఏం పాటరా బాబు..! యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్.. విన్నకొద్దీ వినాలనిపించేలా ఉందిగా

తాజా సమాచారం ప్రకారం ఈ పాటకు సంబంధించిన రీమిక్స్ హక్కులను హీరో కిరణ్ అబ్బవరం సొంతం చేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అంతేకాదు.. తాజాగా దర్శకత్వం వైపు కూడా అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు ‘రియాలిటీ’ అనే టైటిల్‌ను ప్రకటించారు.

తెలుగు సినిమా దెబ్బకు కన్నీళ్లు పెట్టుకుంటున్న నార్త్ ఆడియన్స్.. ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ

ఈ నేపథ్యంలో ‘రఘుకుల తిలకా రారా’ పాటను ‘రియాలిటీ’ సినిమాలో రీమిక్స్ చేయబోతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమై, ఈ క్లాసిక్ భక్తి గీతాన్ని కిరణ్ అబ్బవరం తనదైన స్టైల్‌లో రీమిక్స్ చేస్తే థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా పాటను గ్రాండ్ విజువల్స్‌తో, పవర్‌ఫుల్ కొరియోగ్రఫీతో తెరకెక్కిస్తే సినిమాకు అదనపు హైప్ రావడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరి ‘రియాలిటీ’ సినిమాలో నిజంగానే ‘రఘుకుల తిలకా రారా’ పాట రీమిక్స్ ఉంటుందా? ఉంటే కిరణ్ అబ్బవరం ఈ పాటను ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు.? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

చిరంజీవికి జోడిగా అందాల భామ.. మొదటిసారి మెగాస్టార్‌ సరసన సీనియర్ హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మల్లెపూల పల్లకి సాంగ్‌లానే మరో పాపులర్ పాట..
మల్లెపూల పల్లకి సాంగ్‌లానే మరో పాపులర్ పాట..
పెరిగిన చికెన్ ధరలు.. అదే బాటలో కోడి గుడ్లు కూడా..
పెరిగిన చికెన్ ధరలు.. అదే బాటలో కోడి గుడ్లు కూడా..
ప్రతి రోజూ ఇది ఒక గిన్నెడు తింటే.. దెబ్బకు డయాబెటిస్ జారుకుంటాది
ప్రతి రోజూ ఇది ఒక గిన్నెడు తింటే.. దెబ్బకు డయాబెటిస్ జారుకుంటాది
'5 సార్లు మెయిన్స్.. 3 ఇంటర్వ్యూ.. 6వ ప్రయత్నంలో IPS అయ్యాడు'
'5 సార్లు మెయిన్స్.. 3 ఇంటర్వ్యూ.. 6వ ప్రయత్నంలో IPS అయ్యాడు'
తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో గ్యాస్, అజీర్తి
తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో గ్యాస్, అజీర్తి
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
ఇక తిప్పలు పడాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే 5 నిమిషాల్లో ఫ్యాన్..
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి
చదివింది ఎక్కువకాలం గుర్తుండాలంటే.. ఈ 5 టెక్నిక్స్‌ పాటించండి