AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్తిమీర కోసం ఇక మార్కెట్‌కు వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా పెంచేయండి.. 10 రోజుల్లోనే..

కూరల్లో కొత్తిమీర వేస్తే వచ్చే ఆ మజాయే వేరు.. కానీ మార్కెట్లో కొన్నది తెచ్చిన కొద్దిసేపటికే వాడిపోతుందా? అయితే మీకోసం ఒక అదిరిపోయే ఐడియా. కేవలం 10 రోజుల్లో మీ బాల్కనీలోనే గుప్పెడు కొత్తిమీరను పెంచే సీక్రెట్ పద్ధతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తాజాగా, ఆరోగ్యంగా పెరిగే కొత్తిమీరను మీ ఇంట్లోనే ఎలా పండించాలో తెలుసుకుందాం..

కొత్తిమీర కోసం ఇక మార్కెట్‌కు వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా పెంచేయండి.. 10 రోజుల్లోనే..
Grow Fresh Coriander At Home
Krishna S
|

Updated on: Apr 22, 2026 | 7:10 AM

Share

వంటింట్లో కొత్తిమీర లేనిదే ఏ వంటా పూర్తి కాదు. అది ఇచ్చే రుచి, సువాసన అద్భుతం. అయితే మనం మార్కెట్లో కొనే కొత్తిమీర రెండు రోజులు తిరగకముందే వాడిపోవడం లేదా కుళ్లిపోవడం చూస్తుంటాం. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో కూరగాయలపై రసాయనాల వినియోగం కూడా పెరిగింది. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. కేవలం 10 రోజుల్లోనే మీ ఇంట్లోని కుండీలో తాజాగా, శుభ్రంగా పెరిగే కొత్తిమీరను ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

విత్తనాల ఎంపిక

కొత్తిమీర బాగా పెరగాలంటే విత్తనాలు నాణ్యమైనవిగా ఉండాలి. షాపులో కొన్న ధనియాలను నేరుగా నాటితే అవి మొలకెత్తడానికి చాలా సమయం పడుతుంది. అందుకే విత్తనాలను ఒక గుడ్డలో వేసి మెల్లగా నొక్కి రెండుగా విరవండి. ఇలా రెండుగా విడిపోయిన విత్తనాలు అతి త్వరగా మొలకలు వస్తాయి.

కుండీ – మట్టి మిశ్రమం

కొత్తిమీర వేర్లు సున్నితంగా ఉంటాయి, అందుకే మట్టి గట్టిగా ఉండకూడదు. అడుగున నీరు సాఫీగా బయటకు వెళ్లడానికి రంధ్రాలు ఉన్న కుండీని ఎంచుకోండి. సాధారణ మట్టికి కొంచెం ఇసుక లేదా కోకోపీట్, మరికొంచెం ఎరువు కలిపితే మట్టి గుల్లగా ఉంటుంది. దీనివల్ల వేర్లు వేగంగా విస్తరించి మొక్క బలంగా పెరుగుతుంది.

విత్తే విధానం – జాగ్రత్తలు

సిద్ధం చేసుకున్న ధనియాలను మట్టిపై సమానంగా చల్లండి. ఒకే చోట ఎక్కువ పడకుండా చూసుకోండి. విత్తనాల పైన అర అంగుళం మందం మాత్రమే మట్టి పొరను కప్పండి. మట్టి పైపొర తడిసేలా స్ప్రే బాటిల్‌తో నీటిని చల్లాలి. నేరుగా మగ్గుతో నీళ్లు పోస్తే విత్తనాలు కదిలిపోయి మొలకలు రావు.

పెరిగే వాతావరణం – సూర్యరశ్మి

కొత్తిమీర మొక్కకు మండుటెండ పడదు. ఉదయం 2-3 గంటల ఎండ తగిలితే చాలు. మిగతా సమయం నీడలో ఉన్నా పర్వాలేదు. మట్టి ఎప్పుడూ తేమగా ఉండాలి. మట్టి ఆరిపోయిందనిపిస్తే వెంటనే నీటిని చిలకరించండి. సరిగ్గా 4-5 రోజుల్లో చిన్న చిన్న ఆకుపచ్చని మొలకలు మట్టిని చీల్చుకుని బయటకు రావడం మీరు గమనించవచ్చు.

కోత – నిరంతర సరఫరా

పది రోజులు దాటాక కొత్తిమీర వాడుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. కొత్తిమీరను వేర్లతో సహా పీకకండి. కేవలం పైనుండే ఆకులను కత్తెరతో కత్తిరించండి. ఇలా చేయడం వల్ల ఆ మొక్క మళ్లీ చిగురించి, మీకు మరిన్ని ఆకులను ఇస్తుంది. అంటే ఒక్కసారి నాటితే కొన్ని వారాల పాటు నిరంతరం కొత్తిమీరను కోసుకోవచ్చు.

Follow Us