AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Points Table: ఏం స్కెచ్ రా బాబు.. ఒకే మ్యాచ్‌తో 2 జట్లకు ఇచ్చిపడేసిన హైదరాబాద్.!

IPL 2026 Points Table: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది. ఉప్పల్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన హైదరాబాద్, పాయింట్ల పట్టికలో కీలక మార్పులకు కారణమైంది. అభిషేక్ శర్మ వీరోచిత శతకంతో మెరిసిన ఈ మ్యాచ్, అటు రాజస్థాన్ రాయల్స్ స్థానానికి కూడా ఎసరు పెట్టి టోర్నీని మరింత ఆసక్తికరంగా మార్చేసింది.

IPL 2026 Points Table: ఏం స్కెచ్ రా బాబు.. ఒకే మ్యాచ్‌తో 2 జట్లకు ఇచ్చిపడేసిన హైదరాబాద్.!
Ipl 2026 Points Table
Venkata Chari
|

Updated on: Apr 22, 2026 | 6:59 AM

Share

IPL 2026 Points Table: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో టాస్ ఓడి తొలుత సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. యువ సంచలనం అభిషేక్ శర్మ మొదటి నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించిన అభిషేక్, 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 242 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఢిల్లీ బౌలర్లు ఎంత ప్రయత్నించినా అభిషేక్ జోరును అడ్డుకోలేకపోయారు.

లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబాటు..

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఢిల్లీ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ఒత్తిడిలో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ, నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులకు పరిమితమైంది. దీంతో హైదరాబాద్ 47 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో హైదరాబాద్ వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని జోరు ప్రదర్శిస్తోంది.

పాయింట్ల పట్టికలో పెను మార్పులు..

ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో భారీ లాభాన్ని పొందింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో నాలుగింటిలో గెలిచిన హైదరాబాద్, మొత్తం 8 పాయింట్లతో మూడవ స్థానానికి చేరుకుంది. దీనివల్ల రాజస్థాన్ రాయల్స్ ఒక స్థానం దిగజారి నాలుగవ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం బెంగళూరు, రాజస్థాన్, హైదరాబాద్ జట్లు సమానంగా 8 పాయింట్లతో ఉన్నప్పటికీ, మెరుగైన రన్ రేట్ కారణంగా హైదరాబాద్ మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఢిల్లీ పరిస్థితి ఏంటి?

మరోవైపు ఓటమి పాలైన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలోనే కొనసాగుతోంది. 6 మ్యాచ్‌లలో మూడింటిలో గెలిచిన ఢిల్లీకి ప్రస్తుతం 6 పాయింట్లు ఉన్నాయి. అయితే ఈ ఓటమితో ఆ జట్టు నెట్ రన్ రేట్ క్షీణించింది. పంజాబ్ కింగ్స్ 11 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, హైదరాబాద్ తాజా విజయంతో ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది.

Ipl 2026 Points Table

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us