Horoscope Today: వారి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (April 22, 2026): బుధవారం రాశిఫలాల ప్రకారం మేషం నుంచి మీనం వరకు చాలా రాశుల వారికి ఆర్థిక వృద్ధి సూచనలు ఉన్నాయి. ఉద్యోగాల్లో పురోగతి, వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ప్రమోషన్లు, శుభవార్తలు లభించగా, మరికొన్ని రాశుల వారు సమస్యల నుంచి బయటపడే సూచనలు ఉన్నాయి.

దిన ఫలాలు (ఏప్రిల్ 22, 2026): మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు హ్యాపీగా, ఉత్సాహంగా సాగిపోతాయి. వృషభ రాశి ఉద్యోగులకు ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. వృత్తి జీవితం మూడు పూవులు ఆరు కాయలు అన్నట్టుగా సాగిపోతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలతో పాటు ఆర్థికంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు హ్యాపీగా, ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు, కొత్త పద్ధతులు ప్రవేశపెట్టి లాభం పొందుతారు. కుటుంబ పెద్దల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లలు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపుతో పాటు, కెరీర్ పరంగా తగిన పురోగతి లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. వృత్తి జీవితం మూడు పూవులు ఆరు కాయలు అన్నట్టుగా సాగిపోతుంది. ఆస్తి వ్యవహారం ఒకటి సానుకూలపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, ఆర్థికంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందుతాయి. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందులేమీ ఉండవు. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. కుటుంబ సమేతంగా ఆధ్మాత్మిక సేవల్లో పాల్గొంటారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయంలో కొద్దో గొప్పో పెరుగుదలే తప్ప తరుగుదల ఉండదు. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా, సామరస్యంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతితో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. జీవిత భాగస్వామికి పురోగతి ఉంటుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరుగుతుంది. ఏ రంగంలో ఉన్నా కొద్దిపాటి పురోగతి కూడా ఉంటుంది. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలుగుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. ఆదాయం కొద్దిగానైనా పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదు. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ప్రభుత్వపరంగా ఆశించిన ప్రయోజనాలుంటాయి. జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. భాగస్వాములతో విభేదాలు పరిష్కారమవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో భారీగా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో అధికారులతో అధికారాలను, బాధ్యతలను పంచుకునే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరు విదేశాల్లో స్థిరపడే సూచనలున్నాయి. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. జీతభత్యాల్లో మార్పు ఉండకపోవచ్చు కానీ, అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగపరంగా ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని రాణింపు ఉంటుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెరుగుతుంది. లాభాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. పరిచయస్థుల ద్వారా పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఎవరినీ మరీ గుడ్డిగా నమ్మవద్దు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపా రాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ప్రయోజనం పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులు పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
కొన్ని ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతానికి దానధర్మాలను తగ్గించుకోవడం మంచిది. వ్యాపారాల్లో లాభాలు స్థిరంగా కొనసాగుతాయి. ఇంటా బయటా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ, ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ఉద్యోగపరంగా ఆశించిన ఉత్తమ ఫలితాలుంటాయి. ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక అధికార యోగానికి అవకాశం ఉంది. ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్లు చాలావరకు తగ్గి ఉంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి విముక్తి లభిస్తుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. దైవ సేవా కార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)