నయనతార ప్లేస్ కొట్టేసిన కాజల్.. మరోసారి ఆ స్టార్ హీరో సరసన ఛాన్స్.

Rajitha Chanti

Pic credit - Instagram

21 April 2026

ప్రస్తుతం దక్షిణాదిలో బిజీ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. ఇటీవలే మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసింది కాజల్. చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లు టాక్.

నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య తన 111వ ప్రాజెక్ట్ (NBK 111) కోసం సిద్ధమవుతున్నారు.

తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ అగర్వాల్ ఎంపికైనట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

నిజానికి, ఈ పాత్ర కోసం మొదట సీనియర్ నటి నయనతారను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. బాలకృష్ణ, నయనతార కాంబినేషన్‌లో గతంలో పలు హిట్ మూవీస్ వచ్చాయి.

వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని అభిమానులు భావించారు. అయితే, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో నయనతార ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం.

నయనతార తప్పుకోవడంతో ఆ అవకాశం చందమామ కాజల్ అగర్వాల్‌కు దక్కింది. కాజల్ ఇప్పటికే బాలయ్యతో కలిసి 'భగవంత్ కేసరి' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ,  నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ సరసన నటించే ఛాన్స్ రావడంతో కాజల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.