Lifestyle: ఇంటి చిట్కాలతో దగ్గుకు ఎలా చెక్ పెట్టాలో తెలుసా.?
ఇలాంటి వాటిలో దగ్గు ఒకటి. మనలో చాలా మంది దగ్గు రాగానే వెంటనే సిరప్ వేసుకుంటారు. అయితే దగ్గు రాగానే వెంటనే సిరప్‌లు వేసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సహజ చిట్కాలతో దగ్గుకు చెక్ పెట్టొచ్చు. మరి దగ్గును తగ్గించే ఇంటి చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం వాతావరణం మారుతోంది. సీజన్ మారిన ప్రతీసారి అనారోగ్యాలు వెంటాడడం సర్వసాధారణమైన విషయం. ప్రస్తుతం అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇలాంటి వాటిలో దగ్గు ఒకటి. మనలో చాలా మంది దగ్గు రాగానే వెంటనే సిరప్ వేసుకుంటారు. అయితే దగ్గు రాగానే వెంటనే సిరప్‌లు వేసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సహజ చిట్కాలతో దగ్గుకు చెక్ పెట్టొచ్చు. మరి దగ్గును తగ్గించే ఇంటి చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* దగ్గుతో బాధపడుతుంటే ఉప్పు నీటితో నోటిని పుకిలించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ప్రతీ రోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలిపి పుకిలించడం వల్ల నిరంతర దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది గొంతులో మంటను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.
* పసుపులో ఉన్న ఔషధ గుణాల వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. దగ్గును కూడా తగ్గించడంలో పసుపు ఉపయోగపడుతుంది. పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దగ్గును తగ్గిస్తాయి. పాలలో పసుపు కలుపుకొని తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం పొందొచ్చు.
* నిమ్మరసం, తేనె కూడా దగ్గు నుంచి ఉపశమనం పొందడంలో ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె కలుపుకుని తాగడం వల్ల గొంతుకు ఉపశమనం లభిస్తుంది. తేనెలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు, నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో తేనె కూడా కలుపుకుంటే మరింత మేలు జరగుతుంది.
* ఇక దగ్గుతో బాధపడుతుంటే ఆవిరి కూడా మంచి చిట్కాగా చెప్పొచ్చు. ఆవిరి పట్టుకుంటే దగ్గు నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. నీటిలో పసుపు వేసుకొని ఆవిరి పట్టుకుంటే మరింత ఉపశమనం లభిస్తుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




