Skin Care: మెడపైన ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..! ఈ ఐదు మార్గాలను తెలుసుకోండి..
Skin Care: వృద్ధాప్యం కావాలని ఎవరూ కోరుకోరు. కానీ ఆధునిక జీవన శైలిలో చిన్నవయసులోనే చర్మం ముడతలు పడుతోంది. ముప్పైలోనే అరవైలా కనిపిస్తున్నారు. దీనికి
Skin Care: వృద్ధాప్యం కావాలని ఎవరూ కోరుకోరు. కానీ ఆధునిక జీవన శైలిలో చిన్నవయసులోనే చర్మం ముడతలు పడుతోంది. ముప్పైలోనే అరవైలా కనిపిస్తున్నారు. దీనికి కారణం వాతావరణ కాలుష్యంతో పాటు సమయపాలన లేని జీవనశైలి ఇంకా మద్యపానం లాంటి చెడు అలవాట్లు. అయితే ముఖంపై అందరు దృష్టిసారిస్తారు కానీ మెడని ఎవ్వరూ పట్టించుకోరు. అందుకే ఇది ముడతలు పడి జిడ్డుగా మారుతుంది. దీనిని మళ్లీ పూర్వపు స్థితికి తీసుకురావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. వాటి గురించి తెలుసుకుందాం.
1. తేమ తేనె సహజసిద్దమైన మాయిశ్చరైజింగ్ క్రీమ్. దీనిని కొద్దిగా మెడపై వేసి మాయిశ్చరైజ్ చేయడం వల్ల మృదువుగా మారుతుంది. కొల్లాజెన్ స్థాయిని పెంచుతుంది. ముడుతలను తగ్గిస్తుంది.
2. సన్‌స్క్రీన్ ఉపయోగించండి సూర్యుని ప్రత్యక్ష కిరణాలు మన చర్మానికి చాలా హానికరం. ఇది వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. బయట మేఘావృతమైనప్పుడు కూడా మీరు సన్‌స్క్రీన్ ఉపయోగించడం మానేయకూడదు. బయటకు వెళ్లే ముందు మీ మెడపై తప్పకుండా దీనిని అప్లై చేయండి.
3. చాలా నీరు తాగాలి యవ్వనంగా కనిపించడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి మీరు ముడుతలను దూరంగా ఉంచాలనుకుంటే ఎక్కువ నీరు తాగాలి. మద్యం లేదా ధూమపానం అలవాట్లను తగ్గించడానికి ప్రయత్నించండి.
4. ఆరోగ్యకరమైన ఆహారం ఆరోగ్యకరమైన ఆహారాన్ని సర్దుబాటు చేయడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం చాలా ముఖ్యం. మన రోజువారీ ఆహారంలో ఖనిజాలు, విటమిన్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉండాలి. పండ్లు, కూరగాయలు ప్రతిరోజూ తినేలా చూసుకోండి.
5. ఎక్స్ఫోలియేట్ మెడలో పేరుకుపోయిన మురికి, చనిపోయిన కణాలను వదిలించుకోవడానికి మీ మెడను ఎక్స్‌ఫోలియేట్ చేయడం చాలా ముఖ్యం. మంచి ఎక్స్‌ఫోలియేటర్‌ని కొనుగోలు చేసి కనీసం వారానికి ఒకసారి అప్లై చేయండి.