Health: ఒత్తిడితో చిత్తవుతున్నారా.? వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి.. మంచి ఫలితం ఉంటుంది..
Health: ఒకప్పుడు మనుషులు శారీరకంగా శ్రమపడేవారు.. మానసికంగా ప్రశాంతంగా ఉండేవారు. కానీ ఇప్పుడు శారీరక శ్రమ తగ్గింది, మానసిక శ్రమ పెరిగింది. మారుతోన్న జీవన విధానం ఒత్తిడితో కూడిన పని కారణంగా..

Health: ఒకప్పుడు మనుషులు శారీరకంగా శ్రమపడేవారు.. మానసికంగా ప్రశాంతంగా ఉండేవారు. కానీ ఇప్పుడు శారీరక శ్రమ తగ్గింది, మానసిక శ్రమ పెరిగింది. మారుతోన్న జీవన విధానం ఒత్తిడితో కూడిన పని కారణంగా చాలా మంది మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో పలు రకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయితే ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. యోగా, ధ్యానం వంటి వాటితో ఒత్తిడిని జయించవచ్చని మనందరికీ తెలిసిందే. అయితే తీసుకునే ఆహారం కూడా ఒత్తిడిపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా.? ఒత్తిడిని తగ్గించుకోవడానికి పాటించాల్సిన కొన్ని చిట్కాలపై ఓ లుక్కేయండి..
* మానసిక ఒత్తిడిని తగ్గించడంలో బాదం పప్పు, వాల్ నట్స్ వంటి డ్రైఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వీటి పాత్ర ప్రముఖంగా ఉంటుంది. రోజూ గుప్పుడు మోతాదులో బాదం పప్పు, వాల్‌నట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.
* సాధారణంగా అధిక బరువుతో ఇబ్బందిపడేవారు గ్రీన్ టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే ఒత్తిడిని దూరం చేయడంలో కూడా గ్రీన్ టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఎల్-థియెనిన్ ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు టీని తగ్గించి గ్రీన్ టీని అలవాటు చేసుకోవాలి.
* ఒత్తిడిని తగ్గించడంలో అశ్వగంధ కూడా ఉపయోగపడుతుంది. రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు నిద్రకూడా పడుతుంది.
* తులసిలో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒత్తిడి తగ్గించడంలో తులసి కీలక పాత్ర పోషిస్తుంది. తులసి ఆకులను నీటిలో మరిగించి అందులో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలిపి తాగాలి ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు, మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది.
Also Read: Weather: రైతులకు హెచ్చరిక.. అల్పపీడనం మళ్లీ ఏర్పడింది.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Nisha Agarwal: నిషా అగర్వాన్‌ను ఫోన్ నంబర్ అడిగిన్ నెటిజన్.. ఆమె రియాక్షన్ ఇదే..