Cold: జలుబు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయా..! అయితే ఈ 5 విషయాలు తెలుసుకోండి..

Cold: సాధారణ జలుబు సంవత్సరంలో ఎప్పుడైనా సంభవించవచ్చు. ముక్కు కారటం, తలనొప్పి, శరీర నొప్పులు, గొంతునొప్పి మన రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తాయి.

Cold: జలుబు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయా..! అయితే ఈ 5 విషయాలు తెలుసుకోండి..
Cough
Follow us
uppula Raju

|

Updated on: Nov 13, 2021 | 8:37 PM

Cold: సాధారణ జలుబు సంవత్సరంలో ఎప్పుడైనా సంభవించవచ్చు. ముక్కు కారటం, తలనొప్పి, శరీర నొప్పులు, గొంతునొప్పి మన రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తాయి. జీవన శైలి అస్తవ్యస్తంగా మారుతుంది. నిజం చెప్పాలంటే రోజంతా అనారోగ్యంతో మంచంపై ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే జలుబు మొదలయ్యే ముందు ఆవిరి పడితే మంచిది. దీనివల్ల ముక్కు కారటం నుంచి ఉపశమనం పొందుతారు. చలికాలంలో జలుబును నివారించడానికి, ఫిట్‌గా చురుకుగా ఉండటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. తప్పకుండా చేతులు కడుక్కోవాలి.. కోవిడ్ ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి తినడానికి ముందు లేదా ముఖాలను తాకడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వింటర్ సీజన్‌లో మనం దీన్ని కొనసాగించాలి. జలుబుకు కారణమయ్యే వైరస్‌లు వ్యక్తి దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపిస్తాయి. ఇవి 24 గంటల వరకు చేతులు, ఉపరితలాలపై జీవించగలవు. అందువల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి తినడానికి లేదా మీ ముఖాన్ని తాకడానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటే మంచిది.

2. హైడ్రేటెడ్ గా ఉండండి శీతాకాలంలో నీరు తాగడం చాలా తక్కువ. ఎందుకంటే దాహం వేయదు కాబట్టి ఎక్కువ నీరు తాగము. కానీ ఎప్పుడు ఇలా చేయకూడదు. నీరు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి అనారోగ్యం బారిన పడకుండా చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. నీటి స్థాయిలను పెంచడానికి మీరు బోన్‌ సూప్‌ కూడా తీసుకోవచ్చు.

3. ఆరోగ్యంగా తినండి ఈ సీజన్‌లో ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోండి. ఇది మీకు తగినంత పోషకాలను పొందడంలో సహాయపడుతుంది. మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతుంది. జింక్, విటమిన్ డి తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ రెండు పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అనారోగ్యం బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆకు కూరలు, తృణధాన్యాలు, గింజలు, పండ్లు ఎక్కువగా తినండి.

4. తగినంత నిద్ర జలుబుతో పోరాడటానికి, నిరోధించడానికి మనకు తగినంత నిద్ర అవసరం. నిద్ర లేమి, నాణ్యత లేని నిద్ర వల్ల వైరస్‌లు ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడడం శరీరానికి కష్టతరం అవుతుంది. మీ రోగనిరోధక వ్యవస్థను చురుకుగా పనిచేయాలంటే మీరు ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.

5. వ్యాయామం బరువు తగ్గడానికి లేదా కండరాలను నిర్మించడానికి వ్యాయామం చేయాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో జలుబును నివారించడంలో సహాయపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక కణాలు మీ శరీరంలో వేగంగా ప్రయాణిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

Black Fungus: కరోనా తర్వాత డెంగ్యూ రోగికి బ్లాక్‌ ఫంగస్.. కంటిచూపు కోల్పోయాడు..

Viral Video: పాకిస్తాన్‌ ఓడిపోయినందుకు పిల్లాడి ఏడుపు చూస్తే నవ్వొస్తుంది..! వైరల్‌గా మారిన వీడియో..

గుడ్డులోని పసుపు భాగం ఎంతమంది తింటున్నారు..! మీకు ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..