GHMC on Meat Shops: మనం తినే మాంసం మంచిదేనా? ముక్కకు బల్దియా ముద్ర ఉందా..? లేదంటే జరిగే పరిణామాలేంటి..?

చికెన్.. మటన్.. సండే వచ్చిందా ముద్ద దిగాలంటే ముక్క ఉండాల్సిందే. మరీ ఆ ముక్కకు ముద్ర ఉందా..? ముక్క తెలుసు కానీ ముద్ర ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారా..? మనం తినే మాంసం మంచిదేనా అని తెలియాలంటే ముక్కకు బల్దియా ముద్ర ఉండాల్సిందే.

GHMC on Meat Shops: మనం తినే మాంసం మంచిదేనా? ముక్కకు బల్దియా ముద్ర ఉందా..? లేదంటే జరిగే పరిణామాలేంటి..?
Ghmc Vigil On Unauthorised Mutton, Beef, Chicken Sale In City Shops

GHMC vigil on unauthorised Mutton Shops: చికెన్.. మటన్.. సండే వచ్చిందా ముద్ద దిగాలంటే ముక్క ఉండాల్సిందే. మరీ ఆ ముక్కకు ముద్ర ఉందా..? ముక్క తెలుసు కానీ ముద్ర ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారా..? మనం తినే మాంసం మంచిదేనా అని తెలియాలంటే ముక్కకు బల్దియా ముద్ర ఉండాల్సిందే. లేదంటే, అవగాహనారాహిత్యం, అలసత్వం వహిస్తే ఆరోగ్యానికే ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు.

అనుమతి లేకుండా అక్రమంగా పొట్టేళ్లు, మేకలు వధించి మాంసం విక్రయిస్తున్న షాపులపై బల్దియా అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. సండే రోజు మాంసం లేనిది ముద్ద దిగదు మాంసంప్రియులకు. ఫలాన పొట్టేళు మాంసం కావాలి.. మేక మాంసం కావాలి… మేకపోతుది కావాలి.. నాటు కోడి మాంసం కావాలి.. అంటూ కావాల్సింది కోరి అడిగి మరీ కొట్టించుకు వెళుతుంటారు. మరి అసలు అక్కడ అడిగిందే ఇస్తున్నారా..? పొట్టేళ్లు కోశారా.. గొర్రెను కోశారా.. అది ఆరోగ్యంగా ఉన్నప్పుడే కోశారా.. ఇదంతా ఎలా తెలుసుకోవాలి. కొన్నామా.. తిన్నామా కాదు. అవగాహనారాహిత్యం, అలసత్వం వహిస్తే ఆరోగ్యానికే ప్రమాదం.

ఇన్ని ప్రశ్నల నడుమ తినే మాంసం మంచిదని ముద్రవేసుకుని మనశ్శాంతిగా తింటే ఆ హాయే వేరు. అందుకు హైదాబాద్ మహానగరంలో మటన్, బీఫ్, చికెన్ అమ్మకాలపై బల్దియా పర్యవేక్షణ ఉంటుందని తెలుసుకోవాలి. ట్రేడ్ లైసెన్స్ ఉన్న షాపుల్లోనే మాంసం తీసుకోవాలి. అక్కడ కూడా ఆ మాంసం ఎక్కడినుంచి తెచ్చారో తెలుసుకునే కొనాలని అధికారులు సూచిస్తున్నారు. మటన్, బీఫ్ లపై బల్దియా ముద్రు ఉంటుంది. ఇంక్ లాంటి ముద్రను నగరంలోని ప్రముఖ కబేళాల వద్ద వేస్తుంటారు. ప్రతి కబేళాకు అనుమతి ఉన్న శ్లాటర్స్ సెంటర్ వద్ద వేసి షాపుల వాళ్లకు ఇస్తారు. అదే షాపులకు వెళ్లి సరైన శ్లాటర్ నుంచే తెచ్చారా అని ముద్ర చూపించమని అడగాలని అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్ మహానగరంలో మాంసం దుకాణాల్లో మటన్, బీప్ కేవలం బల్దియా పరిధిలోని అంబర్ పేట్, బోయగూడ అలాగే బయట ఉన్న చెంగిచర్లలోని శ్లాటర్ కేంద్రాల నుంచి మాత్రం తెచ్చుకోవాలి. అక్కడ అధికారులు వధించే పొట్టేళ్లు, మేకలను పరిశీలించి ఆరోగ్యం, వధించడానికి సరైనవేనా అని ధృవీకరిస్తారు. కోసిన తర్వాత వాటికి ఆమోద ముద్రగా ఇంక్ తో స్టాంప్ వేస్తారు. అలా స్టాంప్ వేసిన మాంసాన్ని మాత్రమే నగరంలో ప్రతి కాలనీలో ఉండే దుకాణాదారులు తెచ్చి అమ్మాలి. కానీ, నగరంలో సగానికిపైగా షాపుల్లో ఇష్టం వచ్చినట్లు అక్రమంగా కోసిన వాటిని తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇలాంటి వాటిపై గ్రేటర్ వెటర్నరీ అధికారులు దాడులు జరిపి జరిమానాలు విధిస్తున్నారు.

ఇటీవల ఓ హోటల్ బూజుపట్టిన మాంసం వండిపెడుతున్నట్లు బట్టబయలు అయింది. మూడు రోజుల క్రితంనాటి మాంసంను వండి ఓ ఫుడ్ కోర్ట్ సర్వ్ చేయడంతో పాడైన మాంసం వెలుగులోకి వచ్చింది. సరైన మాంసం సరైన పద్ధతిలో ఫ్రిడ్జ్ లో పెడితే 24 నుంచి 48 గంటలు మాత్రమే ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టింది 48 గంటలు, నార్మల్ గా బయటపెట్టింది 24 గంటలు దాటితే అధికారులు పాడైన మాంసంగా గుర్తిస్తారు. ఇక్ మాంసం దుకాణాలు బల్దియా వెటర్నరీ పరిధిలోకి వస్తే.. హోటల్స్, ఫుడ్ కోర్టుల్లో పచ్చిమాంసం వరకు మాత్రమే బల్దియ్ ఆధీనంలో ఉంటుంది. వండిన తర్వాత ఫుడ్ కంట్రోల్ పరిధిలోకి వెళ్తుంది. కల్తీ మాంసం ఉండకపోవచ్చు. కానీ.. ఖరాబైన మాంసం కొంతమంది కన్నింగ్ గాళ్లు అమ్ముతున్నారు. అలాగే, మేకను గొర్రెపోతు అని ఒకదానికి బదులు మరొకటి, నిల్వ చేసిన మాంసం అమ్ముతున్న ఘటనలు కోకొల్లలు. వీటిపై దృష్టి పెట్టిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న షాపులకు జరిమానాలు విధిస్తూ.. ప్రజలు ముద్ర ఉన్న మాంసాన్ని అడిగి కొనాలని అవగాహన కల్పిస్తున్నారు.

బల్దియాలో నిబంధనలు ఉల్లంఘించి ముద్రలేని మాంసాన్ని అమ్ముతున్న షాపులు వందలాది ఉన్నాయి. సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలోనే ఎక్కువగా పాడైన, ముద్రలేని మాంసం అమ్ముతున్నారు. నగరంలో గ్రేటర్ అధికారుల దృష్టికి వచ్చిన ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు 400 పైగా షాపులు ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. అందులో ఒక్క ఖైరతాబాద్ లోనే జనవరి నుంచి దాదాపు అరవై షాపులకు లక్షన్నర జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. కోర్టుకు వెళ్లి ఫైన్ చెల్లించాల్సిన కేసులు 30 కాగా… అందులో ట్రేడ్ లైసెన్ల్ లేవి 10… స్టాంప్ లేని మాంసాన్ని అమ్ముతున్నవి 20 కేసులు ఉన్నాయి. కూకట్ పల్లి, సికింద్రాబాద్ జోన్లలో నెలకు రూ.2 లక్షలకు వరకు జరిమానాలు వేస్తుంటారంటే ఏ మేర నిబంధనలకు విరుద్ధంగా మాంసం అమ్ముతున్నారో అర్థం చేసుకోవచ్చు.

మాంసం షాపుకు వెళితే చికెన్ క్వాలిటీ దేనా.. మటన్ కు ముద్ర ఉందా అని మీ హక్కుగా అడగండి. ముక్క మంచిదేనన్న తృప్తితో మనసారా లాగేయించేయండి.

Read Also.. Air Pollutione Effect: కాలుష్యం ఊపిరితిత్తులకే కాదు.. కళ్లకు కూడా హానికరం.. వైద్య నిపుణుల వెల్లడి..!

Jagannath Temple: పూరి జగన్నాథ ఆలయం హుండీలో రూ. 28 లక్షల నగదు.. కరోనా తర్వాత ఇదే భారీ విరాళం..

Published On - 8:34 pm, Sat, 13 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu