Air Pollutione Effect: కాలుష్యం ఊపిరితిత్తులకే కాదు.. కళ్లకు కూడా హానికరం.. వైద్య నిపుణుల వెల్లడి..!

Air Pollutione Effect: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు నగరాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దేశంలో చాలా చోట్ల కాలుష్యం స్థాయి ప్రమాదకర స్థాయిలో ఉంది. పెరుగుతున్న కాలుష్యం ప్రజల..

Air Pollutione Effect: కాలుష్యం ఊపిరితిత్తులకే కాదు.. కళ్లకు కూడా హానికరం.. వైద్య నిపుణుల వెల్లడి..!
Follow us

|

Updated on: Nov 13, 2021 | 8:16 PM

Air Pollutione Effect: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు నగరాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దేశంలో చాలా చోట్ల కాలుష్యం స్థాయి ప్రమాదకర స్థాయిలో ఉంది. పెరుగుతున్న కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారుతోంది. ఈ విషపూరితమైన గాలి వల్ల ప్రజలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతున్నారని, దాని ప్రత్యక్ష ప్రభావం ఊపిరితిత్తులపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వాయు కాలుష్యం ప్రభావం ఊపిరితిత్తులపైనే కాదు.. మీ కళ్లపై కూడా పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో కాలుష్యం మీ కళ్లకు ఎలాంటి హాని కలిగిస్తుందో తెలుసుకోండి. మీరు కూడా ప్రతి రోజూ కాలుష్యాన్ని ఎదుర్కొవాల్సి వస్తే మీ కళ్లపై కాలుష్య ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలో అనేదానిపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు నిపుణులు. వాస్తవానికి AQI 400 కంటే ఎక్కువ చేరిన అనేక నగరాలు భారతదేశంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులకే పరిమితం అవుతుండగా, ఈ విషపూరిత గాలి వల్ల ప్రజలు కళ్లు కూడా దెబ్బతింటున్నాయి. ఈ విషయమై డాక్టర్‌ షార్ప్‌ సైట్‌ఐ హాస్పిటల్‌ డాక్టర్‌ హేమ్‌ మాట్లాడుతూ.. కాలుష్యం వల్ల కంటి సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువేనని తెలిపారు.

ఎలర్జీ సమస్య

కాలుష్యం వల్ల కళ్లు పొడిబారనడం, ఎలర్జీ సమస్య ఎక్కువగా ఉంటుంది. కళ్లకు తేమ, పోషణ కోసం తగినంత మొత్తంలో కన్నీళ్లు ఉత్పత్తి కాకపోవడంపై డ్రై ఐ సిండ్రోమ్‌ సంభవించే అవకాశం ఉందంటున్నారు. వాయు కాలుష్యం కళ్లలోని కణాలను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా కళ్లలో పొడిబారడం, ఎరుపు, నొప్పి, కాంతికి సున్నితత్వం వంటి సమస్యలు వస్తాయి. కలుషితమైన గాలిలో నైట్రిక్‌ ఆక్సైడ్‌, నైట్రోజన్‌ డయాక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటి మూలకాలు ఉండటం వల్ల కళ్లకు ఎక్కువ నష్టం వాటిల్లుతుందని వివరించారు.

కాలుష్యం సమస్యగా మారింది:

ఇదొక్కటే కాదు.. వాయుకాలుష్యం దీర్ఘకాలిక ప్రభావాల వల్ల కంటి చూపు కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. ఉత్తర భారతదేశంలో కంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

విషపూరిత గాలి నుంచి కళ్లను రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు అనవసరంగా ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడమే మంచిది. కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని హైడ్రేషన్‌లో ఉంచుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు కళ్లద్దాలు పెట్టుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Latest Articles