Seven Week Jewellery: గ్రహదోష నివారణకు ఏడువారాల నగలు.. ఏ రోజు ఏ నగలు ధరించేవారంటే..

Seven Week Jewellery: కొన్ని తరాల ముందు వరకూ ఆడవాళ్లు ఏడురోజులు ఏడు రకాల నగలను ధరించేవారు. వారం రోజులూ ఒకొక్క రోజు ఒకొక్క గ్రాహం అనుగ్రహం కోసం అధిదేవత ఇష్టమైన నగలను ధరించేవారు. వీటిని ధరిస్తే స్త్రీలకు సంపూర్ణ ఆయురారోగ్యం, అష్టఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం. అయితే నేటి జనరేషన్ కు ఏడువారాల నగలు అంటే ఏమిటి.. ఏ రోజు ఏ నగలు ధరించేవారో తెలియదు. ఈ రోజు ఏడువారాల నగలు తెలుసుకుందాం.

Surya Kala

|

Updated on: Nov 13, 2021 | 9:52 PM

ఆదివారం సూర్యభగవానుడికి ఇష్టమైన రోజు. కనుక ఆదివారం రోజున కెంపులతో చేసిన నగలను ధరిస్తారు. కమ్మలు, హారాలు, ఉంగరం అలంకరించుకుంటారు.

1 / 7
సోమవారం చంద్రుడికి ఇష్టమైన రోజు. ఈరోజున చల్లదనం వెదజల్లేలా.. ముత్యాలతోతయారు చేసిన నగలను ధరించేవారు. ముత్యాల హారాలు, ముత్యాల గాజులు, ఉంగరం తదితర నగలను ధరించేవారు

2 / 7
మంగళవారం కుజుడికి సంబంధించిన రోజు. ఆ రోజున పగడాలతో చేసిన హారం, గాజులు, ఉంగరాలు వంటి నగలు పెట్టుకునేవారు.

3 / 7
బుధవారం బుధగ్రహాన్నీ సూచిస్తుంది. ఆ రోజు ఆయనకిష్టమైన పచ్చలతో చేసిన నగలను అలంకరించుకునేవారు.

4 / 7
దేవతల గురువు బృహస్పతిని సూచించే గురువారం పుష్పరాగంతో చేసిన నగలు ధరించేవారు.

5 / 7
 శుక్రవారం శుక్రుడికిష్టమైనది ఆ రోజు లక్ష్మీదేవిలా వజ్రాలతో చేసిన నగలను ధరించేవారు

6 / 7
శనివారం శనీశ్వరుడికి ఇష్టమైన రోజు. కనుక ఈరోజున నీలమణితో చేసిన నగలు ధరించేవారు. ఇలా ఏడురోజులు నవరత్నాలలో చేసిన నగలు ధరిస్తే.. గ్రహ దోషం ఉండదని పూర్వీకులు భావించేవారు.

7 / 7
Follow us