Nisha Agarwal: నిషా అగర్వాల్‌ను ఫోన్ నంబర్ అడిగిన్ నెటిజన్.. ఆమె రియాక్షన్ ఇదే..
చందమామ కాజల్ సోదరి నిషా అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 'ఏమైంది ఈవేళ', 'సోలో' సినిమాలతో ఆమె టాలీవుడ్‌లో మంచి హిట్స్ అందుకుంది.
చందమామ కాజల్ సోదరి నిషా అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ‘ఏమైంది ఈవేళ’, ‘సోలో’ సినిమాలతో ఆమె టాలీవుడ్‌లో మంచి హిట్స్ అందుకుంది. కేవలం 7 సినిమాలే చేసిన ఈ బ్యూటీ.. 2013లో కరణ్‌ను పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తోంది. ఈ జంటకు ఇషాన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే సోషల్ మీడియాలో నిషా ఫుల్ యాక్టివ్. ఇన్‌స్టా వేదికగా తరచూ తన ఫాలోవర్స్‌కు, ఫ్యాన్స్‌కు నిత్యం అప్‌డేట్స్ అందిస్తూ ఉంటుంది. ఫిట్‌నెస్, క్లోతింగ్ గురించి ఆమె తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటుంది. కాగా, తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో సరదాగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. తన ఫ్యామిలీకి సంబంధించిన మధుర జ్ఞాపకాలను అందరికీ చూపించింది.
చాట్ సెషన్‌లో భాగంగా ఓ నెటిజన్.. ‘మేడమ్ మీ ఫోన్ నంబర్ ఇవ్వండి’ అని అడగ్గా.. ఆమె రిప్లై ఇచ్చారు. “వద్దు. అది మాత్రం అడగకండి. నేను ఇవ్వలేను. మీరు నాతో ఏదైనా షేర్ చేసుకోవాలి అనుకుంటే మెయిల్ పంపించండి” అని పేర్కొన్నారు. అలాగే ఇన్‌స్టాలో డైరెక్ట్ మెస్సేజ్ చేయండి అంటూ అతడికి సమాధానం ఇచ్చారు. మరో నెటిజన్.. “మీరు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా?” అని ప్రశ్నించగా.. “మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను” అని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు.
Also Read: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. జబర్దస్త్ నుంచి ఔట్!