AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC MD Sajjanar: సజ్జనార్ నోటీసులు.. దిగొచ్చిన రాపిడో…

ఆర్టీసీ బస్సు ఎక్కితే మసాలా దోశలా నలిగిపోతావ్.. రాపిడో బుక్ చేసుకో సింపుల్‌గా పోతావ్.. తొందరగా ఎక్కెయ్ అనేది అల్లు అర్జున్ చేసిన యాడ్.

TSRTC MD Sajjanar: సజ్జనార్ నోటీసులు.. దిగొచ్చిన రాపిడో...
Rapido Allu Arjun Add
Ram Naramaneni
|

Updated on: Nov 13, 2021 | 3:17 PM

Share

ఆర్టీసీ బస్సు ఎక్కితే మసాలా దోశలా నలిగిపోతావ్.. రాపిడో బుక్ చేసుకో సింపుల్‌గా పోతావ్.. తొందరగా ఎక్కెయ్ అనేది అల్లు అర్జున్ చేసిన యాడ్. ఈ యాడ్‌ వివాదాన్ని రేపింది. రాపిడో సంస్థ ఇటీవలే విడుదల చేసిన యాడ్‌లో అల్లు అర్జున్​ నటించాడు. అందులో.. దోశలు వేసే వ్యక్తిగా బన్నీ కనిపించాడు. రాపిడోను ప్రమోట్​ చేసే క్రమంలో.. బస్సు ప్రయాణాన్ని దోశతో పోల్చుతూ డైలాగ్స్ చెప్తాడు. బస్సుల్లో ప్రయాణం చేయటం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారని.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాపిడో సేవలను ఉపయోగించుకోవాలని ఆ యాడ్ సారాంశం.

పేదవారి సేవలో ఉన్న ఆర్టీసీ బస్సును కించపరుస్తూ రూపొందించిన ఈ యాడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు.  ఆర్టీసీని కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ యాడ్‌లో నటించిన అల్లు అర్జున్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. ఇలాంటి యాడ్‌కు రూపొందించిన రాపిడో సంస్థకూ నోటీసులు పంపారు. ప్రజాజీవనంలో భాగమైన ఆర్టీసీ బస్సును కించపరిచేలా యాడ్‌ రూపొందిస్తారా ? అని మండిపడ్డారు సజ్జనార్‌. సమాజాన్ని ప్రభావితం చేసే స్థానంలో ఉన్న సెలబ్రిటీలు.. డబ్బుల కోసం ఇలాంటి వాటిల్లో నటించడం భావ్యం కాదన్నారు. ఆర్టీసీని కించపరిస్తే సంస్థ, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరన్నారు. తమ నోటీసులకు స్పందించకపోతే.. లీగల్‌గా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

రాపిడో సంస్థతో పాటు అల్లు అర్జున్‌కు సజ్జనార్‌ లీగల్‌ నోటీసులు ఇవ్వడంతో దీనిపై టీవీ9లో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో ర్యాపిడో సంస్థ దిగొచ్చింది. తెలంగాణ ఆర్టీసీ సీటీ బస్సును ఉపయోగించుకుని యాడ్‌‌లో చిత్రీకరించిన సన్నివేశాలను తొలగించింది.

Also Read: ఈ ఫోటోలో పిల్లి ఎక్కడుందో గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్.

అదిరిపోయిన అయ్యగారి అభిమాని డ్యాన్స్.. కింగ్ సాంగ్‌కు ఊరమాస్ స్టెప్పులు

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్