AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayyagaru: అదిరిపోయిన అయ్యగారి అభిమాని డ్యాన్స్… కింగ్ సాంగ్‌కు ఊరమాస్ స్టెప్పులు

సౌత్‌లో సినిమా హీరోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అభిమానులు వారిని డెమి గాడ్స్‌‌గా భావిస్తారు. సినిమా రిలీజ్ సందర్భంగా పూనకాలతో ఊగిపోతారు.

Ayyagaru: అదిరిపోయిన అయ్యగారి అభిమాని డ్యాన్స్... కింగ్ సాంగ్‌కు ఊరమాస్ స్టెప్పులు
Akhil Fan
Ram Naramaneni
|

Updated on: Nov 13, 2021 | 6:02 PM

Share

సౌత్‌లో సినిమా హీరోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అభిమానులు వారిని డెమి గాడ్స్‌‌గా భావిస్తారు. సినిమా రిలీజ్ సందర్భంగా పూనకాలతో ఊగిపోతారు.  వారి బర్త్ డేలకు రక్త దానాలు చేస్తారు. తమ అభిమాన హీరో ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టాలని ఆరాటపడుతుంటారు. ఇలా అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. అయితే అఖిల్ అక్కినేని అభిమాని ఒకరు ఈ మధ్య నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాడు.  అఖిల్ సినిమా రిలీజ్ అంటే చాలు.. అతడు ఊగిపోతాడు.  ‘ఆడే నంబర్ వన్.. అయ్యగారే నంబర్ వన్…’ అంటూ రచ్చ చేస్తాడు. ‘అయ్యగారే కరెక్టు.. అఖిల్‌ అయ్యగారే రావాలి’ అంటూ తన అమితమైన ప్రేమను ప్రదర్శిస్తాడు. అతని వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. మీమ్స్ చేసేవాళ్లు అతడిని మరికొంత ప్రమోట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే అఖిల్ ఎంత ఫేమస్సో.. అఖిల్ అభిమాని అయ్యగారు కూడా అంతే ఫేమస్. ఇతని అసలు పేరు నాగరాజు. ఊరు గుంటూరు. కాగా ఇటీవల అఖిల్ తన క్రేజీ ఫ్యాన్ నాగరాజు గురించి రెస్పాండ్ అయ్యాడు.  అతని వీడియోలను చూశానని… అతనిచ్చిన ‘అయ్యగారు’ అనే పదం తన లైఫ్‌ని టేక్‌ఓవర్‌ చేసిందని చెప్పుకొచ్చాడు. అతను ఇంత ఫేమస్‌ అయినందుకు సంతోషం ఉందని… నాగరాజును కలిసేందుకు ఎదురుచూస్తున్నా అని పేర్కొన్నాడు.

కాగా తాజాగా నాగరాజు కింగ్ నాగార్జున నటించిన రగడ సినిమాలోని సాంగ్‌‌కు డ్యాన్స్ చేస్తోన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతడు తన మార్క్ స్టెప్పులతో మరోసారి నెటిజన్ల అటెన్షన్ గ్రాబ్ చేశాడు. ఈ క్రేజీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో పిల్లి ఎక్కడుందో గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్

ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ