Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. అభిమానులకు స్పెషల్ అప్డేట్ ఇచ్చిన రాధేశ్యామ్ మేకర్స్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో సినిమా తర్వాత ప్రభాస్ స్క్రీన్ పై

Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. అభిమానులకు స్పెషల్ అప్డేట్ ఇచ్చిన రాధేశ్యామ్ మేకర్స్..
Radhesyam
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 13, 2021 | 11:29 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో సినిమా తర్వాత ప్రభాస్ స్క్రీన్ పై కనిపించలేదు. దీంతో ఆయన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. అయితే ఓ వైపు ప్రభాస్ సినిమాలను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నా.. ఇప్పటివరకు ఒక్క సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ క్రమంలో ప్రభాస్.. పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో నటించిన రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తు్న్నారు. అయితే ఈ మూవీ పూర్తై చాలా రోజులు గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. రాధేశ్యామ్ సినిమా నుంచి ఒక్క అప్డేట్ అయిన ఇవ్వండంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్స్‏కు రాధేశ్యా్మ్ చిత్రయూనిట్ దిగొచ్చింది.

రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ రిలీజ్ చేసే సమయాన్ని.. తేదీని ప్రకటించి అభిమానులకు కాస్త ఖుషి చేసింది. ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా నుంచి “ఈ రాతలే.. ” అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ వీడియోను ఈనెల 15న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు.

Also Read: Maalavika Sundar: తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్.. ఫోటోస్ వైరల్..

Pawan Kalyan: సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో పవన్ నయా ప్రాజెక్ట్.. కానీ కండిషన్స్ అప్లై..

Bellamkonda Ganesh : బెల్లంకొండ చిన్నబాబు కోసం బాలీవుడ్ హీరోయిన్ కూతురు.. గణేష్ బాబు సినిమాలో హీరోయిన్ ఎవంటే..