Liger Movie: అమెరికాలో వాలిపోయిన లైగర్‌ బాయ్స్‌… మైక్‌టైసన్‌తో సన్నివేశాల కోసమేనా.?

Liger Movie: విజయ్‌ దేవరకొండ హీరోగా, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'లైగర్‌'. విజయ్‌ బాక్సర్‌గా కనిపిస్తోన్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్‌ మైక్‌ టైసన్‌..

Liger Movie: అమెరికాలో వాలిపోయిన లైగర్‌ బాయ్స్‌... మైక్‌టైసన్‌తో సన్నివేశాల కోసమేనా.?
Liger Movie
Follow us

|

Updated on: Nov 13, 2021 | 7:50 PM

Liger Movie: విజయ్‌ దేవరకొండ హీరోగా, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘లైగర్‌’. విజయ్‌ బాక్సర్‌గా కనిపిస్తోన్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్‌ మైక్‌ టైసన్‌ ఈ సినిమాలో నటిస్తుండడం విశేషం. ఇక విజయ్‌ కెరీర్‌లో తెరకెక్కుతోన్న తొలి పాన్‌ ఇండియా చిత్రంగా పేరుగాంచిన ఈ సినిమాతో విజయ్‌ కెరీర్‌ కూడా ముడిపడి ఉంది. దీంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో భారత్‌లో షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్‌ తాజాగా కొత్త షెడ్యూల్‌ కోసం అమెరికా వెళ్లింది.

ఈ క్రమంలో ఇప్పటికే పూరి జగన్నాథ్‌తో పాటు విజయ్‌ దేవరకొండ అమెరికాలోని లాస్‌వేగాస్‌కు చేరుకున్నారు. ఈ షెడ్యూల్‌లో మైక్‌ టైసన్‌, విజయ్‌ దేవరకొండల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారని సమాచారం. ఇక విజయ్‌, పూరీలు కలిసి వేగాస్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కడ రెస్టారెంట్‌తో పాటు కొన్ని లొకేషన్స్‌లో ఫోటోలు దిగుతున్నారు. తాజాగా ఈ ఫోటోలను నిర్మాత ఛార్మి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోలతో పాటు.. ‘ఇంటెన్స్‌తో కూడిన కొత్త షెడ్యూల్‌ ప్రారంభించే ముందు బాయ్స్‌ వేగాస్‌లో చిల్‌ అవుతున్నారు’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. ఇదిలా ఉంటే లైగర్‌ చిత్రాన్ని.. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కౌర్ – కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలసి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

Also Read: BSF Recruitment: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో గ్రూప్‌ సీ పోస్టులు.. రూ. 90 వేలకు పైగా జీతం పొందే అవకాశం.

Diabetes: ఈ రక్త పరీక్షల ద్వారా మధుమేహాన్ని 20 ఏళ్ల ముందుగానే గుర్తించవచ్చు.. శాస్త్రవేత్తల వెల్లడి..!

Nithya Menen: బక్క చిక్కిన తగ్గని అమ్మడి అందం.. నిత్యా మీనన్‌ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ