Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hottest Chilli on Earth: ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరపకాయ.. భారత్‌లో మాత్రమే సాగు.. ఖరీదు తెలిస్తే షాక్..

ఎండు మిరపకాయలు కూడా ఖరీదైనదివిగా మారాయి. కిలో రూ.400 అయింది. కాగా గతేడాది వరకు కిలో ధర రూ.100 మాత్రమే ఉండేవి. అయితే ఈ రోజు మనం ఖరీదైన ఎర్ర మిరపకాయ గురించి తెలుసుకుందాం..  ఇది ప్రపంచంలోని అత్యంత ఘాటైన మిరపకాయలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీంతో పాటు దీని రేటు కూడా కిలో వేల రూపాయలు ఉంటుంది.

Hottest Chilli on Earth: ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరపకాయ.. భారత్‌లో మాత్రమే సాగు.. ఖరీదు  తెలిస్తే షాక్..
Bhut Jolokia
Follow us
Surya Kala

|

Updated on: Aug 17, 2023 | 8:22 AM

ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో కూరగాయలు, బియ్యం, పప్పు సహా అన్ని వస్తువుల ధరలు రోజురోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. ఇదీ అది అనేది లేదు.. పాలు, పెరుగు, గోధుమలు, పిండి, బియ్యం, పప్పులతో సహా అన్ని రకాల ఆహార పదార్థాలు ఖరీదైనవిగా మారాయి. అంతేకాదు మరోవైపు అనేక రకాల మసాలా దినుసుల ధర చుక్కలను తాకుతూ సామాన్య ప్రజలను కంటతడి పెట్టిస్తోంది. గత కొన్ని నెలల్లో మసాలా దినుసుల ధరలు రెండింతలు పెరిగాయి. ముఖ్యంగా జీలకర్ర కిలో 1200 నుంచి 1400 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా ఎండు మిరపకాయలు కూడా ఖరీదైనదివిగా మారాయి. కిలో రూ.400 అయింది. కాగా గతేడాది వరకు కిలో ధర రూ.100 మాత్రమే ఉండేవి. అయితే ఈ రోజు మనం ఖరీదైన ఎర్ర మిరపకాయ గురించి తెలుసుకుందాం..  ఇది ప్రపంచంలోని అత్యంత ఘాటైన మిరపకాయలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీంతో పాటు దీని రేటు కూడా కిలో వేల రూపాయలు ఉంటుంది.

నిజానికి మనం ‘భూత్ జోలోకియా’ దీనినే ఘోస్ట్ పెప్పర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రపంచంలోనే అత్యంత మంట పుట్టించే ఎర్ర మిరపకాయ ఇదేనని చెబుతున్నారు. ఒక్క సారి తిన్న తర్వాత చెవిలోంచి పొగ రావడం మొదలవుతుంది. అదే సమయంలో దీని ధర విన్న తర్వాత ఎవరైనా షాక్ తింటారు. విశేషమేమిటంటే ఈ ఘోస్ట్ పెప్పర్ భారతదేశంలో మాత్రమే సాగు చేయబడుతుంది. నాగాలాండ్‌లోని కొండ ప్రాంతాల్లో మాత్రమే రైతులు దీనిని సాగు చేస్తారు. భూత్ జోలోకియా ఘాటు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.

ఘోస్ట్ పెప్పర్ పొడవు 3 సెం.మీ

ఇది చాలా రకాల ఎర్ర మిరపకాయలు.. ఇది చాలా తక్కువ సమయంలో పంట చేతికొస్తుందని. మొక్కలను నాటిన 90 రోజుల తర్వాత పంట పూర్తిగా సిద్ధమవుతుంది. అంటే భూత్ జోలోకియా మొక్కల నుండి ఎర్ర మిరపకాయల పంట దిగుబడికొస్తుంది. ఈ భూత్ జోలోకియా సాధారణ ఎర్ర మిరపకాయల కంటే పొడవు తక్కువగా ఉంటుంది. దీని పొడవు 3 సెం.మీ వరకు ఉంటుంది, వెడల్పు 1 నుండి 1.2 సెం.మీ.

ఇవి కూడా చదవండి

పెప్పర్ స్ప్రే తయారీలో

పెప్పర్ స్ప్రే కూడా ‘భూత్ జోలోకియా’ నుండి తయారు చేయబడుతుంది, మహిళలు తమ వద్ద భద్రత కోసం ఉంచుకుంటారు. తాము ప్రమాదంలో ఉన్నామని మహిళలు భావిస్తే ఈ పెప్పర్ స్ప్రేని ఉపయోగిస్తారు. దీంతో  గొంతులో, కళ్లలో మంటలు వస్తున్నాయి. నాగాలాండ్‌లో రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తారు.  అయితే ఈ ఘోస్ట్ పెప్పర్ ఇంటి లోపల కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. దీనిని ఘోస్ట్ చిల్లీ, నాగా జోల్కియా లేదా ఘోస్ట్ పెప్పర్ అని కూడా అంటారు.

 ఒక కిలో భూత్ జోలోకియా ఖరీదు

భూత్ జోలోకియాకు 2008లో GI ట్యాగ్ లభించింది. అదే సమయంలో, 2021 సంవత్సరంలో, జోలోకియా మిరపకాయలు భారతదేశం నుండి లండన్‌కు ఎగుమతి చేయబడ్డాయి. విశేషమేమిటంటే భూత్ జోలోకియా సాధారణ ఎర్ర మిరపకాయల కంటే చాలా ఖరీదైనది. ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అమెజాన్‌లో 100 గ్రాముల భుట్ జోలోకియా మిర్చి ధర రూ.698గా ఉంది. ఈ విధంగా ఒక కేజీ భూత్ జోలోకియా ధర రూ.6980 అయింది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..