AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccine: టీకా వేసుకున్న తర్వాత జ్వరం ఎందుకు వస్తుంది? దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి?

Vaccine Side Effects: యువకుల్లో రోగనిరోధక వ్యవస్థ చాలా చురుగ్గా ఉండటం వల్ల వారికి జ్వరం వచ్చే అవకాశం ఎక్కువ. వయస్సు పైబడిన వారిలో రోగనిరోధక శక్తి స్పందన నెమ్మదిగా ఉండటం వల్ల లక్షణాలు తక్కువగా ఉండవచ్చు. గతంలోనే సదరు వైరస్‌కు లేదా..

Vaccine: టీకా వేసుకున్న తర్వాత జ్వరం ఎందుకు వస్తుంది? దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి?
Vaccine Side Effects
Subhash Goud
|

Updated on: Apr 26, 2026 | 8:51 AM

Share

Vaccine Side Effects: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 నుండి ఏప్రిల్ 30 వరకు ‘ప్రపంచ రోగనిరోధక శక్తి వారోత్సవాలను’ నిర్వహిస్తారు. ప్రాణాంతక వ్యాధుల నుండి అన్ని వయసుల వారిని రక్షించడంలో వ్యాక్సిన్ల ప్రాముఖ్యతను వివరించడమే ఈ వారం ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. గత 50 ఏళ్లలో టీకాల వల్ల దాదాపు 15 కోట్ల మంది ప్రాణాలు కాపాడారు. అయితే, చాలా మందిలో టీకా వేసుకున్న తర్వాత జ్వరం రావడం సహజం. దీనిని చూసి టీకా తమకు పడలేదని లేదా అనారోగ్యం కలిగిస్తోందని చాలా మంది భయపడుతుంటారు. కానీ, వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది పూర్తిగా భిన్నమైన విషయం.

టీకా వేసుకున్నాక జ్వరం ఎందుకు వస్తుంది?

మన శరీరంలోకి టీకాను వేసినప్పుడు అందులో ఉండే బలహీనమైన లేదా నిర్జీవమైన వైరస్/బ్యాక్టీరియా భాగాలను మన రోగనిరోధక వ్యవస్థ గుర్తిస్తుంది. అప్పుడు మన శరీరం వాటిపై పోరాడటానికి ‘యాంటీబాడీస్’ ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. సైటోకిన్స్ (Cytokines): ఈ పోరాట ప్రక్రియలో మన కణాలు ‘సైటోకిన్స్’ అనే పదార్థాలను విడుదల చేస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని ప్రేరేపించడంలో సహాయపడతాయి.

ఉష్ణోగ్రత పెరుగుదల: ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మన శరీర ఉష్ణోగ్రత తాత్కాలికంగా పెరుగుతుంది. దీనివల్ల జ్వరం, అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే మీ శరీరం లోపల వ్యాధిపై పోరాడే శక్తి తయారవుతోందని చెప్పడానికి ఇది ఒక సంకేతం.

అందరికీ జ్వరం ఎందుకు రాదు?

ప్రతి ఒక్కరి రోగనిరోధక వ్యవస్థ స్పందించే తీరు వేరువేరుగా ఉంటుంది. కొందరి శరీరం ‘గట్టిగా’ స్పందిస్తుంది. అందుకే వారికి జ్వరం వంటి లక్షణాలు బయటపడతాయి. మరికొందరిలో ఈ ప్రక్రియ చాలా ‘నిశ్శబ్దంగా’ జరుగుతుంది. వారికి జ్వరం రాకపోయినా, లోపల రోగనిరోధక శక్తి మాత్రం సమానంగానే తయారవుతుంది.

వయస్సు ప్రభావం:

యువకుల్లో రోగనిరోధక వ్యవస్థ చాలా చురుగ్గా ఉండటం వల్ల వారికి జ్వరం వచ్చే అవకాశం ఎక్కువ. వయస్సు పైబడిన వారిలో రోగనిరోధక శక్తి స్పందన నెమ్మదిగా ఉండటం వల్ల లక్షణాలు తక్కువగా ఉండవచ్చు. గతంలోనే సదరు వైరస్‌కు లేదా టీకాకు గురైనట్లయితే, శరీరం దానిని త్వరగా గుర్తించి సునాయాసంగా పోరాడుతుంది. దీనివల్ల జ్వరం వచ్చే ఛాన్స్ తగ్గుతుంది.

జ్వరం రాకపోతే టీకా పనిచేయనట్లా?

ఖచ్చితంగా కాదు. టీకా వేసుకున్న తర్వాత జ్వరం రావడం అనేది మీ రోగనిరోధక వ్యవస్థ పనిచేస్తోందని చెప్పడానికి ఒక సూచిక మాత్రమే. కానీ అది తప్పనిసరి కాదు. జ్వరం వచ్చినా, రాకపోయినా టీకా తన పని తాను చేస్తుంది. మీకు రక్షణను అందిస్తుంది.

ఇది కూడా చదవండి: Anant Ambani: అనంత్ అంబానీ చేతికి రూ.12 కోట్ల వాచ్‌.. ఇందులో ప్రత్యేకతలేంటో తెలుసా?

ఇది కూడా చదవండి: Gold Price Today: శాంతించిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు బిగ్‌ అలర్ట్‌.. వీరికి పీఎం కిసాన్‌ నిలిపివేత.. కారణం ఏంటంటే..!

Follow Us