AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI Jobs: డిగ్రీ అర్హతతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షల్లో జీతం

RBI Junior Engineer  Recruitment 2026: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) బ్రాంచుల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారంటే..

RBI Jobs: డిగ్రీ అర్హతతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షల్లో జీతం
RBI Junior Engineer Recruitment
Srilakshmi C
|

Updated on: Apr 26, 2026 | 9:12 AM

Share

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌) పోస్టులు 7, జూనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులు 4 వరకు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మే 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఆర్బీఐలో ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆర్బీఐలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్రీలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్ల వరకు వయసులో సడలింపు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్ధులకు పదేళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 13 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 15 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 6, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, సర్టిఫికెట్ల వెరిపికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్ష జూన్‌ 2026 ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష విధానం..

రాత పరీక్ష మొత్తం 180 ప్రశ్నలకు 300 మార్కులకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంజనీరింగ్‌ పేపర్‌ (డిస్క్రీప్టివ్) 1 విభాగంలో 40 ప్రశ్నలకు 100 మార్కులు, ఇంజనీరింగ్‌ పేపర్‌ (డిస్క్రీప్టివ్) 1 విభాగంలో 40 ప్రశ్నలకు 100 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కుల చొప్పున కేటాయిస్తారు.

ఆర్బీఐలో ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us