కొలెస్ట్రాల్‌ రోగులు రోజూ గుడ్డు తింటే ఏమవుతుంది?

25 April 2026

TV9 Telugu

TV9 Telugu

ఆరోగ్యానికి మేలు చేసే గుడ్లు రోజువారీ ఆహారంలో రకరకాలుగా తీసుకోవచ్చు. పలు వంటకాలతో కలిపి కూడా తినవచ్చు

TV9 Telugu

ముఖ్యంగా ప్రోటీన్ కోసం చాలా మంది గుడ్లపై ఆధారపడుతుంటారు. కొందరికి ఇవి ప్రతి రోజు బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరి కాగా, మరికొందరికి కొలెస్ట్రాల్ గురించి సందేహాలు ఉంటాయి

TV9 Telugu

అయితే గుడ్లు కేవలం సులభమైన ఆహారమే కాదు. ఇవి శరీరానికి అవసరమైన అనేక పోషకాలను కలిగి ఉంటాయి

TV9 Telugu

మెదడు పనితీరు, శక్తి స్థాయిలు, చర్మం, జుట్టు, కంటి ఆరోగ్యం వంటి అంశాల్లో కూడా గుడ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇక 14 రోజుల పాటు గుడ్ల‌ను ప్రతిరోజూ తింటే శరీరంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి

TV9 Telugu

మొదట‌గా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. గుడ్లలో కోలిన్ అనే పోషకం అధికంగా ఉంటుంది. ఇది మెదడులో అసెటైల్కోలిన్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్ తయారీలో సహాయపడుతుంది

TV9 Telugu

ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహకరిస్తుంది. రెండవది, కొలెస్ట్రాల్ సమతుల్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. గుడ్లు కొలెస్ట్రాల్ పెంచుతాయని భావన ఉంటుంది

TV9 Telugu

అయితే చాలా మందిలో ఇవి హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) స్థాయిల‌ని పెంచడంలో సహాయపడతాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఉపయోగకరం. మూడవది, కంటి ఆరోగ్యానికి గుడ్లు మేలు చేస్తాయి

TV9 Telugu

గుడ్ల పచ్చసొనలో లుటీన్, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హానికరమైన బ్లూ లైట్ నుంచి కళ్లను రక్షించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలికంగా కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి