Anant Ambani: అనంత్ అంబానీ చేతికి రూ.12 కోట్ల వాచ్.. ఇందులో ప్రత్యేకతలేంటో తెలుసా?
Anant Ambani: ఈ వాచ్‌లోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే ఇందులో శివుడు ధ్యాన ముద్రలో కొలువై ఉండటం. శివుని విగ్రహంతో పాటు పవిత్రమైన “ఓం” గుర్తును కూడా ఇందులో చెక్కారు. ఇది భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిని, అత్యాధునిక సాంకేతికతను మేళవించిన అరుదైన డిజైన్. శివుని ధ్యాన ముద్ర పరమ శాంతికి, ఏకాగ్రతకు, అంతర్గత శక్తికి ప్రతీకగా భావిస్తారు.

Anant Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం వారి విలాసవంతమైన జీవనశైలికి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా, అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ధరించిన ఒక అరుదైన వాచ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రముఖ సంస్థ ‘జాకబ్ అండ్ కో’ (Jacob & Co) రూపొందించిన “ఓపెరా గాడ్‌ఫాదర్ బాగుట్ శివ” వాచ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
డిజైన్, అద్భుతమైన కళాఖండం:
ఈ వాచ్ కేవలం సమయాన్ని చూపే పరికరం మాత్రమే కాదు. ఇది ఒక అద్భుతమైన కళాఖండం. దీని ప్రత్యేకతలు ఇవే:
ధర: నివేదికల ప్రకారం, ఈ వాచ్ విలువ సుమారు రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. వాచ్ బయటి భాగం 18 క్యారెట్ల రోజ్ గోల్డ్తో తయారు చేసి ఉంది. దీనిని మరింత అందంగా తీర్చిదిద్దడానికి 300 కంటే ఎక్కువ బాగుట్-కట్ వజ్రాలతో సహా మొత్తం 1,000 కంటే ఎక్కువ వజ్రాలను ఇందులో పొందుపరిచారు.
ఇది కూడా చదవండి: Gold Price Today: శాంతించిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!
శివుని ధ్యాన ముద్ర – ఆధ్యాత్మికత:
ఈ వాచ్‌లోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే ఇందులో శివుడు ధ్యాన ముద్రలో కొలువై ఉండటం. శివుని విగ్రహంతో పాటు పవిత్రమైన “ఓం” గుర్తును కూడా ఇందులో చెక్కారు. ఇది భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిని, అత్యాధునిక సాంకేతికతను మేళవించిన అరుదైన డిజైన్. శివుని ధ్యాన ముద్ర పరమ శాంతికి, ఏకాగ్రతకు, అంతర్గత శక్తికి ప్రతీకగా భావిస్తారు. అనంత్ అంబానీకి దైవచింతన ఎక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వాచ్ ఆయన అభిరుచులకు, భారతీయ మూలాలకు అద్దం పట్టేలా ఉంది.
ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. వీరికి పీఎం కిసాన్ నిలిపివేత.. కారణం ఏంటంటే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




