AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీర్స్ అని ఎందుకు అంటారు..? దీని వెనుక ఉన్న పెద్ద కథ ఏంటి..? ఆసక్తికరమైన విషయాలు మీకోసం..!

మీరు ఒక సందర్భంలో పబ్‌ లో గ్లాసు ఎత్తుతూ.. స్నేహితులతో కాఫీ తాగుతూ చీర్స్ అనే పదాన్ని వినే ఉంటారు. ఇది చాలా మందికి ఆనందానికి గుర్తు అని తెలుసు. కానీ అసలు ఈ పదం ఎందుకు వచ్చిందో.. దాని వెనక చరిత్ర ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా..? అందరికీ తెలిసినట్లుగా చీర్స్ అనేది ఒక సమూహ ఆనందానికి గుర్తుగా మారింది. కానీ ఈ చిన్న పదానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది.

చీర్స్ అని ఎందుకు అంటారు..? దీని వెనుక ఉన్న పెద్ద కథ ఏంటి..? ఆసక్తికరమైన విషయాలు మీకోసం..!
Say Cheers
Prashanthi V
|

Updated on: Jun 25, 2025 | 7:39 PM

Share

చీర్స్ అనే పదం ఫ్రెంచ్ భాషలోని చియెర్ అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం ముఖంపై కనిపించే ఉత్సాహం, ఆనందం. 18వ శతాబ్దంలో ఈ పదం శుభాకాంక్షలు చెప్పేటప్పుడు వాడేవారు. నెమ్మదిగా ఇది తాగడంతో ముడిపడి, ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ చీర్స్ అనడం అలవాటుగా మారింది.

అప్పట్లో శత్రువులు విషం కలిపే ప్రమాదం ఎక్కువగా ఉండేది. అందుకే డ్రింక్ లు ఇచ్చే ముందు గ్లాసులను గట్టిగా ఒకదానితో ఒకటి కొట్టేవారు. దీని వల్ల వాటిలోని ద్రవం ఒక గ్లాసులో నుంచి ఇంకొక గ్లాసులోకి కలిసిపోయేది. ఇలా చేస్తే ఏదైనా గ్లాసులో విషం ఉంటే అది అన్ని గ్లాసుల్లోకి వెళ్లేది. అందువల్ల అందరూ ఒకేలా డ్రింక్ తీసుకుంటున్నారని టెన్షన్ లేకుండా తీసుకునేవారు.

తాగేటప్పుడు మనం కంటితో డ్రింక్ చూస్తాం, చేతితో పట్టుకుంటాం, వాసన చూస్తాం, రుచి చూస్తాం.. నాలుగు ఇంద్రియాలు పాల్గొంటాయి. ఐదవది వినికిడి. గ్లాసులు గట్టిగా కొట్టినప్పుడు వచ్చే శబ్దంతో ఈ వినికిడిని కూడా చేర్చేలా ఇది మొదలైంది. ఈ శబ్దం ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.

చెడు శక్తులు పారిపోతాయనే నమ్మకం కూడా ఉంది. యూరోప్‌ లో ప్రజలు గ్లాసులను గట్టిగా కొట్టడం వల్ల చెడు ఆత్మలు భయపడి పారిపోతాయని నమ్మారు. ఈ పని ఒక రకమైన ఆధ్యాత్మిక రక్షణగా భావించబడేది.

దేవతలకు నైవేద్యంగా మద్యం ఇవ్వడం.. కొన్ని పాత సంస్కృతులలో మద్యం దేవతలకు నైవేద్యంగా ఇచ్చేవారు. ఎక్కువ కాలం జీవించడానికి, మంచి జరగడానికి వారు ఇలా చేసేవారు. ఈ సమయంలో గ్లాసును పైకి ఎత్తి చీర్స్ అనడం.. ఆ దేవతలకు కృతజ్ఞత చెప్పినట్లుగా భావించబడింది.

ఇప్పుడు చీర్స్ అనేది మద్యం తాగేటప్పుడు మాత్రమే కాదు.. సాధారణ డ్రింక్ తాగేటప్పుడు కూడా వాడుతారు. కాఫీ, టీ లాంటి మామూలు డ్రింక్ లను తాగేటప్పుడు కూడా చాలా మంది స్నేహంగా ఒకరినొకరు చూసుకుంటూ గ్లాసులు కొట్టి చీర్స్ అంటారు. ఇది ఇప్పుడు స్నేహాన్ని, ఐక్యతను, ఒకరికొకరు గౌరవాన్ని తెలియజేసే చిహ్నంగా మారింది.

చీర్స్ కేవలం ఒక మాట కాదు. వందల ఏళ్లుగా కొనసాగిన సంస్కృతి, ఆచారాలు, భద్రత జాగ్రత్తలు, నమ్మకాలు అన్నింటికీ ఇది ఒక గుర్తు. మనం ఇప్పుడు గ్లాసులు పైకి ఎత్తి చీర్స్ అనేటప్పుడు.. ఈ మాట వెనక ఉన్న చరిత్రను గుర్తు చేసుకుంటే ఆ క్షణం మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది.