AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interesting Facts: పాదాలకు ఉన్న రెండో వేలుకే ఎందుకు మెట్టెలు పెడతారు..

పెళ్లి అయిన ప్రతీ మహిళల కాలి వేళ్లకు మెట్టెలు ఉండటం సహజం. సాధారణంగా అయితే కాలి బొటన వేలు పక్కన మూడు వేళ్లకు కూడా మెట్టెలను ఉంచుతారు. కానీ ఇప్పుడున్న కాలంలో కేవలం బొటన వేలు పక్కన ఉన్న వేలుకి మాత్రమే ఉంచుకుంటున్నారు. అయితే చాలా మంది మహిళలకు ఈ డౌట్ వచ్చే ఉంటుంది. మహిళలకే కాదు.. పురుషులకు కూడా ఎందుకు పెడతారు? అని ఆలోచించే ఉంటారు. మరి కాలి వేళ్లకే ఎందుకు మెట్టెలను పెడతారు? ఇందుకు కారణం కూడా..

Interesting Facts: పాదాలకు ఉన్న రెండో వేలుకే ఎందుకు మెట్టెలు పెడతారు..
Interesting Facts
Chinni Enni
| Edited By: |

Updated on: Jul 21, 2024 | 8:53 AM

Share

పెళ్లి అయిన ప్రతీ మహిళల కాలి వేళ్లకు మెట్టెలు ఉండటం సహజం. సాధారణంగా అయితే కాలి బొటన వేలు పక్కన మూడు వేళ్లకు కూడా మెట్టెలను ఉంచుతారు. కానీ ఇప్పుడున్న కాలంలో కేవలం బొటన వేలు పక్కన ఉన్న వేలుకి మాత్రమే ఉంచుకుంటున్నారు. అయితే చాలా మంది మహిళలకు ఈ డౌట్ వచ్చే ఉంటుంది. మహిళలకే కాదు.. పురుషులకు కూడా ఎందుకు పెడతారు? అని ఆలోచించే ఉంటారు. మరి కాలి వేళ్లకే ఎందుకు మెట్టెలను పెడతారు? ఇందుకు కారణం కూడా ఉంది. పూర్వం పెద్దలు ఏం చేసినా అన్నీ ఆలోచించే చేసేవారు కదా. కాలి బొటన వేలు పక్కన ఉన్న కాలికి ఎందుకు మెట్టెలు పెడతారో శాస్త్రీయ పరంగానే కాకుండా.. సైన్స్ పరంగా కూడా కారణాలు ఉన్నాయి.

వెండి మెట్టెలే ఎందుకు?

పెళ్లి అయిన ప్రతీ స్త్రీ కాలికి వెండి మెట్టెలను పెడుతూ ఉంటారు. కాలికి వెండి మెట్టెలే ఎందుకు పెట్టాలి? అనే డౌట్ కూడా వచ్చే ఉంటుంది. వెండిని ధరించడం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తుంది. శరీరంలోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. శక్తిని ఇస్తుంది.

ఈ కారణం చేతనే మెట్టెలను ధరిస్తారు..

పెళ్లైన ప్రతీ మహిళ కాలి వేళ్లకు మెట్టెలు ఉండటం సర్వ సాధారణం. కాలి వేళ్లను బట్టే మహిళకు పెళ్లి అయ్యిందో.. లేదో.. చెప్పొచ్చు. ఇది ఒక కారణం అయితే.. పాదంలోని రెండో వేలు నేరుగా గుండె, గర్భాశయానికి అనుసంధానమై ఉంటుంది. ఈ వేలుకు మెట్టె ధరించడం వల్ల స్త్రీలలో రక్త పోటు అనేది సక్రమంగా జరుగుతుంది. అంతే కాకుండా పీరియడ్స్ కూడా సక్రమంగా వస్తాయని సైన్స్ కూడా వివరిస్తోంది. అలాగే మహిళ పునరుత్పత్తి అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మనసు ప్రశాంతంగా ఉంటుంది:

కాలి రెండో వేలుకు మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రక్త ప్రసరణ కూడా చక్కగా ప్రసరిస్తుంది. అలాగే మహిళలు లైంగిక ప్రక్రియ సమయంలో వచ్చే నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగించడం కోసం ఈ మెట్టెలను పెడతారు.

నాడీ కేంద్రాలు చక్కగా పని చేస్తాయి:

కాలి రెండో వేలుకు మెట్టెలను పెట్టడం వల్ల నాడీ కేంద్రాలు యాక్టివ్ అవుతాయి. చేతిలో ఉన్నట్టే కాళ్లలో కూడా నాడీ కేంద్రాలు ఉంటాయి. ఇవి కాలి వేలుకు మెట్టెలు పెట్టడం వల్ల.. నడిచేటప్పుడు నొక్కుతాయి. దీని వల్ల నాడీ కేంద్రాలు ప్రభావితం అవుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ
ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు