Diabetic Patients: షుగర్ పేషెంట్లు వద్దనుకున్నా పదే పదే స్వీట్లు ఎందుకు తింటారు?

డయాబెటిస్.. ఇప్పుడు ఈ పేరు వినని భారతీయుడు ఉండడు. ఈ పేషెంట్ లేని ఇల్లు కూడా లేదు. ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యధికంగా డయాబెటీస్ రోగులున్న దేశం మనది. ఏడాది క్రితం ICMR విడుదల చేసిన గణాంకాల ప్రకారం..

Diabetic Patients: షుగర్ పేషెంట్లు వద్దనుకున్నా పదే పదే స్వీట్లు ఎందుకు తింటారు?
Maxresdefault (1)
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 07, 2024 | 10:34 AM

డయాబెటిస్.. ఇప్పుడు ఈ పేరు వినని భారతీయుడు ఉండడు. ఈ పేషెంట్ లేని ఇల్లు కూడా లేదు. ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యధికంగా డయాబెటీస్ రోగులున్న దేశం మనది. ఏడాది క్రితం ICMR విడుదల చేసిన గణాంకాల ప్రకారం మన దేశంలో 10 కోట్లమందికి పైగా డయాబెటీస్‌తో బాధపడుతున్నారు. కేవలం 2019-2021 మధ్య కాలంలోనే ఏకంగా 3 కోట్ల మందికి డయాబెటీస్ సోకింది. ప్రపంచంలో సుమారు 14 కోట్లమంది రోగులతో చైనా మొదటి స్థానంలో ఉండగా… పది కోట్ల మంది షుగర్ పేషెంట్లతో ఇండియా రెండో స్థానంలో సుమారు మూడున్నర కోట్ల మంది రోగులతో పాకిస్తాన్ మూడో స్థానంలో ఉంది.

సరే.. ఈ లెక్కల సంగతి కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేసేవే అనుకుందాం. కానీ వాస్తవం ప్రతి ఇంట్లోనూ కనిపిస్తునే ఉంది కదా… గడిచిన పదేళ్లలో ప్రతి ఇంట్లోనూ దాదాపు ఓ డయాబెటిస్ పేషెంట్ కనిపిస్తున్నారు. మన గల్లీలో, మన ఊళ్లో, మన జిల్లా కేంద్రంలో డయాబెటిస్ స్పెషలిస్ట్‌ పేరుతో ఎంత మంది కొత్త డాక్టర్లు తయారయ్యారు. షుగర్ వ్యాధికి ప్రత్యేకం అంటూ ఎన్ని కొత్త ఆస్పత్రుల బోర్డులు పెరిగాయి. ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్ స్టాలలో .. ఇది తినండి.. అవి తినండి.. ఈ గింజలు మంచివి.. ఆ ఆకులు మంచివి.. అంటూ ఎంత మంది ఉచిత సలహాలిచ్చేవాళ్లు పెరిగారు..? ఇవన్నీ చూసిన తర్వాతైనా ఆ లెక్కలు మనం నిజమని నమ్మాల్సిందే కదా..!

షుగర్ వచ్చినంత మాత్రానా.. స్వీట్లు మానేయాలా…? స్వీట్లు తినని వాళ్లకు షుగర్ కంట్రోల్‌లో ఉంటోందా..? ఈ ప్రశ్నలకు ఒక్కో డాక్టర్ ఒక్కోలా సమాధానం చెబుతారు. ఇప్పుడు పేర్లు ప్రస్తావించడం లేదు కానీ… రాష్ట్రంలో ప్రముఖ వైద్యులు, పదే పదే టీవీల్లో కనిపించే పెద్ద పెద్ద డాక్టర్లలో కూడా షుగర్ పేషెంట్లు ఏం తినాలన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. సరే… అసలు ఈ షుగర్ పేషెంట్లకు పదే పదే ఎందుకు తీపి పదార్థాలు తినాలనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని ఒట్టేసుకున్నా సరే… ఎందుకు పదే పదే ఆ ఒట్టును గట్టు మీద పెట్టేస్తుంటారు..? దీనికి చాలా శాస్త్రీయ కారణాలున్నాయి.

1. బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ బాగా తగ్గితే..

కేవలం మనిషికి మాత్రమే కాదు. అన్ని జీవులకు శక్తినిచ్చే వనరుల్లో చక్కెర పాత్ర కీలకం. అలాంటిది శరీరంలోని రక్తంలో చక్కెర నిల్వలు బాగా పడిపోయినప్పుడు స్వీట్లు, చాక్లెట్లు, ఇతర కార్బోహైడ్రేట్లతో కూడిన తక్షణ ఎనర్జీ ఇచ్చే ఆహార పదార్థాలను మన శరీరం కోరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే, అవి తక్షణం, తేలికగా శరీరానికి శక్తిని అందిస్తాయి .

2. డోపమైన్, సెరోటోనిన్ పడిపోవడం..

డోపమైన్.. మన మెదడులోనూ, శరీరంలోనూ కీలక పాత్ర పోషించే ఒక నాడీ ప్రసారణి. ఇది మెదడుకు ఉత్సాహాన్ని, సంతృప్తిని, ఉత్తేజం వంటి ఫీలింగ్స్‌ని ఇస్తుంది. సీట్లు, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అవి మరింత డోపమైన్ విడుదలయ్యేలా చేసి ఓ రకంగా తీపి పదార్థాలను తినడంలో ఎంజాయ్ చేసేలా చేస్తుంది. దీంతో మరిన్ని సీట్లు, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పదార్థాలను తినాలనుకుంటారు డయాబెటీస్ రోగులు. కార్బోహైడ్రేట్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను పురుషులతో పోలిస్తే, మహిళలకు ఎక్కువగా తినాలనిపిస్తుంటుంది.

3. ఒత్తిడి పెరగడం

ఒత్తిడి, విసుగు, భావోద్వేగ స్థాయిలు పెరగడం వంటి కారణాలు కూడా డయాబెటీస్ రోగుల్ని తీపి ఆహార పదార్థాలను ఎక్కువగా తినేలా ప్రోత్సహిస్తాయి. ఒత్తిడిని కలిగించే హార్మోన్ కార్టిసాల్ ముఖ్యంగా తియ్యటి ఆహార పదార్థాలను తినేలా చేస్తుంది. దీర్ఘకాలికంగా ఉండే ఒత్తిడి, హై కేలరీలు ఆహారంలో కలిసినప్పుడు తియ్యటి ఆహార పదార్థాలను ఎక్కువగా తినాలపిస్తుంది. అందుకే ఒత్తిడి ఎక్కువగా ఉన్న వారు తమకు తెలీకుండానే ఎక్కువగా స్వీట్లను తింటూ ఉంటారు. ఫలితంగా బరువు కూడా పెరుగుతుంటారు.

4. స్వీట్లు తినాలనిపించినప్పుడు ఏం చెయ్యాలి ?

కచ్చితంగా సమతుల ఆహారం తీసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలి. మీ భోజనంలో సరైన ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. ఇవి మీ కడుపు నింపడమే కాదు. చక్కెర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడాన్ని నియంత్రిస్తాయి.

ప్రతి భోజనంలో 20 నుంచి 40 గ్రా. ప్రొటీన్లు తప్పనిసరి

అలాగే వయోజనులు తమ ప్రతి భోజనంలో 20 నుంచి 40 గ్రాముల మధ్యలో ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్లు ఉండాలి. కండరాల ఆరోగ్యానికి శరీర బరువులో ప్రతి కేజీకి కనీసం 0.8 గ్రాముల ప్రొటీన్లను ప్రతి రోజూ తీసుకోవాలి. ఫైబర్ అత్యధికంగా ఉన్న కూరగాయలు, తృణధాన్యాలను తినాలి. ఇవి రక్తంలో మీ చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ఉదాహరణకు బ్రోకోలి, క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్, బీన్స్ వంటివి తినాలి. ప్రాణాయామం, యోగ లేదా గట్టిగా శ్వాస తీసుకోవడం వంటి విధానాల ద్వారా ఒత్తిడి స్థాయిలను నియంత్రించుకోవాలి. ఆహార పదార్థాల విషయంలో శ్రద్ధగా ఉండటం, నెమ్మదిగా తినడం, శరీర స్పందనలకు అనుభూతి చెందడం వంటివి రోజూ తీసుకునే కేలరీలను, కార్బోహైడ్రేట్స్ తినాలనే కోరికను, ఒత్తిడి వల్ల కలిగే కోరికను తగ్గించుకోవచ్చు.

సరైన సమయానికి నిద్రపోవాలి. ప్రతి రోజూ కనీసం 7 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. నిద్ర సరిగ్గా లేకపోతే కూడా హార్మోన్లు ప్రభావితమై, ఆకలి, తినాలనే కోరిక విషయంలో నియంత్రణ కోల్పోతాం. ఆరోగ్యకరమైన ఆహారం తినాలనుకున్నప్పుడు లేదా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు తీపి, ఉప్పు, కార్పోహైడ్రేట్ లాంటి పదార్థాలు తినాలనే కోరికను అధిగమించడం పెద్ద సవాలుతో కూడిన అంశమే. కానీ తప్పదు ఆ సవాల్ స్వీకరించి తీరాల్సిందే. అయినా సరే మీ ప్రయత్నానికి అవాంతరాలు ఎదురవుతునే ఉంటాయి. కానీ తప్పదు సహనంతో ఉంటూ మిమ్మల్ని మీరు నియంత్రించుకొని తీరాల్సిందే.

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..