AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్రోవర్ట్? ఎక్స్‌ట్రోవర్ట్? కాదు..సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ‘ఓట్రోవర్ట్’ అంటే ఏంటి

అమెరికాకు చెందిన సైకియాట్రిస్ట్ ఒకరు ఈ 'ఓట్రోవర్ట్' అనే పదాన్ని సృష్టించారు. తన దగ్గరకు వచ్చే రోగుల ప్రవర్తనను, తన స్వంత వ్యక్తిత్వాన్ని విశ్లేషించిన తర్వాత ఆయన ఈ ముగింపుకు వచ్చారు. సంప్రదాయ వర్గీకరణలకు అందని వ్యక్తులను వివరించడానికి ఇది ఒక సరికొత్త నిర్వచనం.

ఇంట్రోవర్ట్? ఎక్స్‌ట్రోవర్ట్? కాదు..సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న ‘ఓట్రోవర్ట్’ అంటే ఏంటి
Who Is An Otrovert.jpg (1)
Nikhil
|

Updated on: Mar 28, 2026 | 6:10 AM

Share

ప్రస్తుత డిజిటల్ యుగంలో మన వ్యక్తిత్వాలను, భావోద్వేగాలను వివరించడానికి రకరకాల కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటివరకు మనకు ‘ఇంట్రోవర్ట్’ ( అంతర్ముఖుడు), ‘ఎక్స్‌ట్రోవర్ట్’ ( బహిర్ముఖుడు) అనే పదాలు మాత్రమే తెలుసు. కానీ, ఇటీవల సోషల్ మీడియాలో ‘ఓట్రోవర్ట్’ అనే కొత్త పదం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. చాలామంది తమ గురించి తాము ఇన్నాళ్లూ వివరించలేకపోయిన ఒక విలక్షణమైన స్థితిని ఈ పదం ఖచ్చితంగా ప్రతిబింబిస్తోందని అభిప్రాయపడుతున్నారు. అసలు ఈ ‘ఓట్రోవర్ట్’ అంటే ఎవరు? వారి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం.

ఓట్రోవర్ట్ అంటే..

పైకి చూస్తే ఓట్రోవర్టులు అందరితో కలిసినట్లు, సంభాషణల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు కనిపిస్తారు. వారు ఏ గుంపులోనైనా సులభంగా కలిసిపోగలరు. కానీ, లోపల మాత్రం వారు ఆ సమూహానికి చెందని వారిలా భావిస్తుంటారు. వీరిని “ఇన్‌సైడర్లలా పరిగణించబడే అవుట్‌సైడర్లు” అని ప్రముఖ డాక్టర్ వర్ణించారు.

ముఖ్యమైన లక్షణాలు

  • ఎక్స్‌ట్రోవర్టుల్లా వీరు ఇతరులతో కలవడం వల్ల శక్తిని పొందరు. అలాగని ఇంట్రోవర్టుల్లా ఒంటరిగా ఉండాలని కూడా అనుకోరు. వీరు ఆ రెండింటికీ మధ్యలో ఒక విభిన్నమైన ప్రపంచంలో నివసిస్తారు.
  • వీరు ఒక సమూహంలో ‘ఫిట్’ అవ్వడానికి ప్రయత్నించరు. అందరి మెప్పు పొందడం కంటే, తమకు తాముగా నిజాయితీగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తారు.
  • వీరు సమాజంలో జరిగే చిన్న చిన్న విషయాలను కూడా చాలా సునిశితంగా గమనిస్తారు. ఇతరుల పట్ల ఎక్కువ సానుభూతిని కలిగి ఉంటారు.

ఓట్రోవర్ట్ అనేది ఒక వ్యక్తిత్వం కాదు. మనుషులను ఏదో ఒక కేటగిరీకి పరిమితం చేయడం వల్ల వారిలోని సహజత్వాన్ని కోల్పోతాం. ఓట్రోవర్టులు తమ స్వేచ్ఛను, స్వతంత్రతను అమితంగా ప్రేమిస్తారు. వీరు ఇతరుల గుర్తింపు కోసం ఆరాటపడరు, తమకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటారు. “నేను ఎవరికీ తక్కువ కాదు.. అలాగని అందరితో ఒకరిని కాదు” అని భావించే వారికి ‘ఓట్రోవర్ట్’ అనేది ఒక చక్కని నిర్వచనం. మీరు కూడా ఒకరితో మనస్ఫూర్తిగా కనెక్ట్ అవుతూనే, మీ అంతర్గత స్వేచ్ఛను కాపాడుకోవాలనుకుంటే.. మీరు ఖచ్చితంగా ఒక ‘ఓట్రోవర్ట్’ కావొచ్చు. ఈ సంక్లిష్టమైన ప్రపంచంలో మన వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది మానసిక ఎదుగుదలకు మొదటి అడుగు.

Follow Us