AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DEET App: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. డీట్ యాప్ గురించి మీకు తెలుసా…?

DEET App: ప్రతి సంవత్సరం 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వంటి విద్యా కోర్సులు పూర్తి చేసేవారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కానీ, వీరిలో చదువును పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం దొరకేవారిని కొద్దిమంది మాత్రమే. ఎక్కువ మంది నిరుద్యోగులుగా ఉండటానికి కారణం ఉద్యోగ అవకాశాల గురించి సరైన సమాచారం లేకపోవడం, నోటిఫికేషన్లను గమనించకపోవడం. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం డీట్ యాప్ తీసుకొచ్చింది.

DEET App: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. డీట్ యాప్ గురించి మీకు తెలుసా...?
DEET App
Rajashekher G
|

Updated on: Mar 27, 2026 | 11:33 PM

Share

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతీ సంవత్సరం పది తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి చదువులు పూర్తి చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే, వీరిలో చదువు పూర్తైన వెంటనే ఉద్యోగాలు పొందే వారు తక్కువే. చాలామంది ఉద్యోగ అవకాశాల గురించి తెలియకపోవడం, నోటిఫికేషన్లను గమనించకపోవడం వల్ల నిరుద్యోగిగా మిగిలిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (DEE Telangana) యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా యువతకు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఏ శాఖలో ఏ రకమైన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవచ్చు.

యాప్‌లో ఎలా నమోదు చేసుకోవాలి?

  • యాప్ డౌన్లోడ్ చేయడం: మన స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి “DEE Telangana” అని సెర్చ్ చేయాలి. అధికారిక యాప్‌ని ఇన్‌స్టాల్ చేయాలి.
  • నోటిఫికేషన్లు ఆన్ చేయడం: యాప్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత నోటిఫికేషన్లు ఆన్ చేసుకోవాలి, తద్వారా కొత్త ఉద్యోగ అవకాశాల సమాచారం తక్షణమే అందుతుంది.
  • జాబ్ సీకర్‌గా నమోదు కావడం: పూర్తి పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. పుట్టిన తేదీ, లింగం, సామాజిక స్థితి, దివ్యాంగులా కాదా, చిరునామా వంటి వివరాలు కూడా ఇవ్వాలి.
  • అదనపు సమాచారం నమోదు చేయడం: తెలిసిన భాషలు, విద్యార్హత, నైపుణ్యాలు, గత పని అనుభవం వంటి వివరాలు ఎంటర్ చేయాలి. విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లను యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • ఉద్యోగాలు చూడడం: ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మన విద్యార్హతలకు, నైపుణ్యాలకు అనుగుణంగా ఖాళీ ఉద్యోగాల వివరాలు యాప్‌లో కనిపిస్తాయి.

జిల్లాలో నమోదైనవారి గణాంకాలు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటి వరకు పది తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థుల సంఖ్య సుమారుగా లక్షమందికి పైగా ఉంది.

  • పదో తరగతి పూర్తి: 43,611 మంది
  • ఇంటర్ పూర్తి: 14,611 మంది
  • డిగ్రీ పూర్తి: 13,180 మంది
  • బిఇడీ పూర్తి: 5,796 మంది
  • ఐటీఐ పూర్తి: 4,920 మంది
  • ఉద్యోగులకూ, అభ్యర్థులకు కూడా సౌలభ్యం

DEE Telangana యాప్ కృత్రిమ మేధ (AI) ఆధారితంగా పనిచేస్తుంది.

నిరుద్యోగులు మాత్రమే కాదు, ఉద్యోగం ఇచ్చే సంస్థలు కూడా ఈ యాప్‌లో నమోదు అవ్వవచ్చు. ఒకే ప్లాట్‌ఫామ్‌లో ఉద్యోగం పొందదలచినవారు, ఉద్యోగం అందించదలచిన సంస్థలు కలసి సులభంగా ఇంటరాక్ట్ కావచ్చు. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాల గమనింపు, నోటిఫికేషన్ అందించడం, అవసరమైన పరిజ్ఞానం కల్పించడం ఇలా అన్ని విధాలా యువతకు ఉపయోగకరంగా ఉంటుంది.

Follow Us