AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Daily Horoscope in Telugu: మార్చి 28, 2026 శనివారం రాశిఫలాల ప్రకారం మేషం నుంచి మీనం వరకు చాలా రాశుల వారికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో పురోగతి, ఆదాయ వృద్ధి, ఆకస్మిక ధనలాభాలు, శుభవార్తలు లభించే సూచనలు ఉన్నాయి. కొంతమందికి ఆరోగ్య జాగ్రత్తలు అవసరం ఉన్నప్పటికీ, మొత్తం మీద ఈ రోజు చాలా రాశుల వారికి విజయాలు, గుర్తింపు, సానుకూల ఫలితాలు దక్కే అవకాశముంది.

Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 28 March 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 28, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (మార్చి 28, 2026): మేష రాశి వారు ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ముఖ్యమైన పెండింగ్ పనులు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి రోజంతా బాగా సానుకూలంగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితంలో ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి జీవితంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ముఖ్యమైన పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఊహించని ధన యోగం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రోజంతా బాగా సానుకూలంగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితంలో ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు తగ్గించు కోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశివారికి అన్నిటా విజయాలు లభిస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి జీవితంలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆనుకూలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. షేర్లలో బాగా లబ్ధి పొందుతారు.

కర్కాటకం (పునర్వసు 4, పు‌ష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. తలపెట్టిన పనులు కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. అనుకోకుండా బాగా డబ్బు కలిసి వస్తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఈ రాశివారు ఎటు వంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల మీద శ్రద్ధ పెంచుతారు. ఆర్థికంగా, కుటుంబపరంగా పరిస్థి తులు మెరుగుపడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో బాగానే లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మున్ముందు మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ సభ్యుల సాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు వేగం పుంజు కుంటాయి. పెద్ద ఎత్తున పెళ్లి ప్రయత్నాలు చేపడతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రేమ వ్యవహారాలు పరవాలేదనిపిస్తాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్థిక విషయాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో అధికారుల ఆదరాభిమానాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల మీద మరింతగా దృష్టి కేంద్రీకరిస్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామితో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. అనేక విధాలుగా ఆదాయ వృద్ధి చెందుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. కుటుంబ వ్యవహారాలు బాగానే చక్కబడతాయి. ఆదాయం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు శుభవార్తవింటారు. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాలు బాగా సంతృప్తికరంగా సాగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇతరత్రా అంతా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యానికి లోటు ఉండదు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి.

Follow Us