Sleeping Tips : సరైన నిద్ర లేకపోతే ఏం జరుగుతుంది..! ఆరోగ్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది..?
Sleep : ప్రతి ఒక్కరికి నిద్ర చాలా ముఖ్యం. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఆధునిక జీవన శైలిలో చాలామంది సమయపాలన పాటించడం లేదు. దీంతో తినే సమయంలో
Sleeping Tips : ప్రతి ఒక్కరికి నిద్ర చాలా ముఖ్యం. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఆధునిక జీవన శైలిలో చాలామంది సమయపాలన పాటించడం లేదు. దీంతో తినే సమయంలో నిద్ర, నిద్రించే సమయంలో తినడం చేస్తున్నారు. దీంతో పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మానసిక, శారీరక వృద్ధికి నిద్ర అనేది కచ్చితంగా అవసరం. ఉదాహరణకు శిశువు 18-20 గంటల వరకు నిద్రపోవచ్చు. 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కొన్ని గంటల నిద్ర మాత్రమే అవసరం. యువకులకు, పెద్దలకు 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. నిద్రలేకుంటే ముందుగా బరువు పెరుగుతారు. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. దీర్ఘకాలిక నిద్ర లేమి డయాబెటిస్ మెల్లిటస్, స్ట్రోక్, ఊబకాయం, గుండె జబ్బులకు కారణమవుతుంది.
నిద్ర లేమికి కారణాలు.. శారీరక లేదా మానసిక సమస్యలు నిద్ర సమస్యలను కలిగిస్తాయి. అలాగే ఉష్ణోగ్రత, పెద్ద పెద్ద శబ్దాలు, సరైన లైటింగ్ లేకపోవడం వల్ల నిద్ర భంగం కలుగుతుంది. అధిక మొత్తంలో కెఫిన్, స్టిమ్యులేట్ మందులు, ధూమపానం, ఆల్కహాల్ తాగడం నిద్రను ప్రభావితం చేస్తుంది. ఆందోళన, రుగ్మత, డిప్రెషన్, మానసిక ఆరోగ్య పరిస్థితులు, నిద్రలేమికి కారణమవుతాయి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) అని పిలవబడే రుగ్మత నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. ఇది ప్రధానంగా ఊబకాయం ఉన్నవారిలో కనిపించే సాధారణ పరిస్థితి. బిగ్గరగా గురక పెడుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుంటారు.
సరైన నిద్రకి కొన్ని అలవాట్లను పాటించాలి.. 1. పగటి నిద్రను నివారించాలి. 2. 4pm దాటిన తర్వాత కెఫిన్ తీసుకోవద్దు. 3. ఒకే సమయంలో నిద్రపోవడం మరియు మేల్కొనడం పాటించాలి. 4. పడకగది వాతావరణం నిద్రకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి. 5. వారాంతాలు, సెలవు దినాలలో మీ నిద్రవేళ దినచర్యకు కట్టుబడి ఉండండి. 6. పఠనం, ధ్యానం, సంగీతం వినడం పడుకోవడానికి ఒక గంట ముందు ఆపండి. 7. నిద్రవేళకు కొన్ని గంటల ముందు భారీ భోజనం మానుకోండి. 8. నిద్రవేళకు కనీసం 2 గంటల ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం మానుకోండి 9. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. నిద్రవేళకు 3 గంటల ముందు మద్యం తీసుకోవడం తగ్గించండి