Weight Loss Mistakes: ఈ తప్పులు చేస్తే అస్సలు బరువు తగ్గరు.. ఊబకాయానికి చెక్ పెట్టాలంటే ముందు ఇవి తెలుసుకోండి
Weight Loss Mistakes: ఉరుకుల పరుగుల ప్రపంచంలో జీవనశైలి, ఒత్తిడి, ఆహార మార్పులు కారణంగా చాలామంది ఊబకాయం బారిన పడుతున్నారు. దాదాపు సగం మంది బరువు సమస్యతో
Weight Loss Mistakes: ఉరుకుల పరుగుల ప్రపంచంలో జీవనశైలి, ఒత్తిడి, ఆహార మార్పులు కారణంగా చాలామంది ఊబకాయం బారిన పడుతున్నారు. దాదాపు సగం మంది బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. స్థూలకాయాన్ని తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. తగ్గడం లేదని చాలామంది చెబుతుంటారు. బరువు తగ్గేందుకు డైటింగ్ చేయడంతోపాటు వ్యాయామాలు చేస్తుంటారు. అయినా చాలా మంది బరువు అలానే ఉంటారు. మరికొంత మంది ఇంకా పెరుగుతుంటారు. దీనికి ప్రధానంగా జీవనశైలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బరువు తగ్గించాలనుకున్నప్పుడు కొన్ని తప్పులు చేయకూడదని పేర్కొంటున్నారు. అలాంటి తప్పులు చేస్తే.. ఎంత శ్రమించినా.. బరువు తగ్గరని.. ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. ముఖ్యంగా మన జీవనశైలి, ఆహారానికి సంబంధించిన తప్పులు చేయవద్దని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు ఓసారి పరిశీలిద్దాం..
తగినంత ఆహారం తినకపోవడం.. చాలామంది ఆహారం తక్కువగా తింటే.. బరువు తగ్గొచ్చని అనుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల కేలరీలు తక్కువ అందినప్పటికీ.. ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. ఫలితంగా శరీర జీవక్రియ ప్రక్రియ దెబ్బతిని బరువు పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు.
డైట్‌లో పోషకాలను తీసుకోకపోవడం.. డైట్ పాటించేటప్పుడు చాలామంది ఆహార అలవాట్లను మార్చుకుంటుంటారు. కేలరీలు తక్కువగా అందే ఆహారాన్ని తింటారు. అయితే.. అలాంటి వారు బరువు తగ్గకపోగా.. ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది. అయితే.. డైట్‌లో అకస్మాత్తుగా.. ప్రోటీన్లు, కొవ్వు, పిండి పదార్థాలను ఆపవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇవేకాకుండా విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు లభించే ఆహారాన్ని పుష్కలంగా తీసుకోవాలి.
మార్పు లేని ఆహారం .. ఒక వేళ బరువు తగ్గడానికి డైట్ ప్లాన్ పాటిస్తే.. తరుచూ మారుస్తుండాలని నిపుణులు పేర్కొంటున్నారు. తరచూ ఒకేరకమైన డైట్ పాటిస్తే.. బరువు తగ్గరని, ఇంకా పెరుగుతారు. కావున బరువు తగ్గడానికి ఆహారంలో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
70 ఆహారం.. 30 శాతం వ్యాయామం అధికంగా వ్యాయామం చేయడంతో కూడా బరువు తగ్గరు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి మేలే.. కానీ ఎక్కువగా చేయడం మాత్రం హానికరమని నిపుణులు పేర్కొంటున్నారు. 70 శాతం ఆహారం తీసుకోని.. 30 శాతం వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గొచ్చని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.
గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం.. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం ద్వారా.. కొవ్వు ఎంజైమ్‌లను కరిగించే లిపేస్ ఎంజైమ్ ఉత్పత్తిని శరీరం నిలిపివేస్తుంది. దీనివల్ల కూడా బరువు పెరుగుతారు.
తగినంత నిద్ర లేకపోవడం.. ఆరోగ్యవంతంగా ఉండాలంటే.. తగినంత సమయం నిద్రపోవాలి. బరువు తగ్గడంలో నిద్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు కనీసం 6 నుంచి 9 గంటల నిద్ర పోవాలి. లేకపోతే బరువు పెరిగే ప్రమాదముంది. దీంతోపాటు నిద్ర పట్టకపోవడం జీవక్రియపై కూడా ప్రభావం చూపుతుంది.
Also Read: