Breast Cancer: తొలిరోజుల్లోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా..? లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు.. మహిళలకు ఎప్పుడైనా రావచ్చు

చర్మం రంగులో ఏవైనా మార్పులను తేలికగా తీసుకోకూడదు. 20 ఏళ్లు పైబడిన మహిళలందరూ నెలకొకసారి తమ రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. చంకల్లో ఏర్పడే గడ్డలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు. రొమ్ము పరిమాణంలో మార్పును కూడా గమనించుకోవాలంటున్నారు. చర్మం రంగు మారడం, చనుమొన వద్ద ఏదైనా

Breast Cancer: తొలిరోజుల్లోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా..? లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు.. మహిళలకు ఎప్పుడైనా రావచ్చు
Cancer Prevent Foods
Follow us

|

Updated on: Mar 10, 2024 | 8:17 AM

రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. స్త్రీలను ప్రభావితం చేసే అత్యంత సాధారణ క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 9 మిలియన్ల మంది మహిళలు క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అంచనా. రొమ్ము క్యాన్సర్ రొమ్ములో చిన్న గడ్డ రూపం నుండి మొదలవుతుంది. కణితి పరిమాణం పెరిగేకొద్దీ ఇది ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. రొమ్ము కణజాలం ఒకే చోట దట్టంగా పేరుకుపోయినా అది క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది. కాబట్టి మీకు రొమ్ముల్లో ఎక్కడైనా చేతికి గట్టిగా తగిలితే వెంటనే మామోగ్రామ్ వంటి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు. ఇది శరీరంలోని నోడ్స్, రక్త ప్రవాహం ద్వారా ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, ఎముకలు వంటి ఇతర అవయవాలకు కూడా వ్యాపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రొమ్ము క్యాన్సర్ ప్రధానంగా మహిళల్లో వస్తుంది. ఇది అన్ని వయసుల మహిళల్లోనూ కనిపిస్తుంది. కానీ ఇది ఎక్కువగా వృద్ధులను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం చాలా మంది రొమ్ము క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్నారు. వయస్సువయస్సు పెరిగేకొద్దీ రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా 50 ఏళ్ల తర్వాత బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఎక్కువగా వస్తుంది. జీన్స్‌ కారణంగా రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. జెనిటిక్‌ మ్యుటేషన్‌ కారణంగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. రొమ్ము క్యాన్సర్‌ రావడానికి మరో ప్రధాన కారణం రొమ్ము పరిమాణం ఎక్కువగా ఉండటం. రొమ్ము పరిమాణం ఎక్కువగా ఉంటే మోమోగ్రామ్‌లో కణితులు గుర్తించడం కష్టంగా ఉంటుంది.

రొమ్ము క్యాన్సర్ వచ్చిన స్త్రీలకు రెండోసారి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. లోబ్యులర్ కార్సినోమా ఇన్ సిటు వంటి కొన్ని వ్యాధుల కారణంగా రొమ్ము క్యాన్సర్‌ వస్తుంది. రేడియేషన్ థెరఫీ కారణంగా రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 30 ఏళ్లలోపు ఎవరైతే రేడియేషన్‌ థెరఫీని ఫాలో అవుతారో వారికి 30 ఏళ్లలోపు రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్‌ ఎక్కువ. చిన్న వయస్సులోనే పీరియడ్స్‌ ప్రారంభమైన వారిలో రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 12 ఏళ్ల లోపు రజస్వల అయిన వారిలో ఈ సమస్య అధికం. అలాగే, లేటుగా మెనోపాజ్‌సాధారణంగా మెనోపాజ్‌ అనేది 45 నుంచి 50 ఏళ్ల వయస్సులో వస్తుంది. మోనోపాజ్‌ 55 ఏళ్ల తర్వాత ఎవరికి వస్తుందో వారిలో రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదం అధికంగా ఉంటుంది. ఆల్కాహాల్‌ సేవించడంతో అనేక సమస్యలు వస్తాయి. ఆల్కాహాల్‌ వినియోగం వివిధ సమస్యలకు కారణం అవుతుంది. ఎక్కువగా మందు తాగితే రొమ్ము క్యాన్సర్‌ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ముందు జాగ్రత్తలు తప్పనిసరి..

రొమ్ములో ఏవైనా గడ్డల వంటివి ఏర్పడకుండా ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి. కానీ అన్ని గడ్డలూ క్యాన్సర్ కావు. చర్మం రంగులో ఏవైనా మార్పులను తేలికగా తీసుకోకూడదు. 20 ఏళ్లు పైబడిన మహిళలందరూ నెలకొకసారి తమ రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. చంకల్లో ఏర్పడే గడ్డలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు. రొమ్ము పరిమాణంలో మార్పును కూడా గమనించుకోవాలంటున్నారు. చర్మం రంగు మారడం, చనుమొన వద్ద ఏదైనా వాపు, ఉత్సర్గను కూడా నిర్ధారించాలి. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే నయం చేయగల వ్యాధి అని కూడా వారు చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి