AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turmeric Water: పరగడుపునే పసుపు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? ముఖ్యంగా ఆడవాళ్లకు..

పసుపు మీకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. పసుపులో అనేక రకాల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కడుపులోని చెడు బ్యాక్టీరియాను చంపి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అన్ని రకాల కడుపు సంబంధిత సమస్యలలో పసుపు ప్రయోజనకరంగా ఉండటానికి ఇదే కారణం. పసుపు నీళ్లు పెయిన్ కిల్లర్ గా కూడా పని చేస్తుంది. దీని తాగడం వల్ల తలనొప్పి, కండరాల నొప్పులు తగ్గుతాయి.

Turmeric Water: పరగడుపునే పసుపు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..? ముఖ్యంగా ఆడవాళ్లకు..
Turmeric Water
Jyothi Gadda
|

Updated on: Mar 08, 2024 | 5:31 PM

Share

Turmeric Water Benefits: పసుపు మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఉంచుతుంది. పసుపులో ఉన్న యాంటీ బాక్టీరియల్ లక్షణాలు గాయాలను నయం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇది మన దేశంలోని ప్రతి వంటింట్లో తప్పక ఉండే మసాలా దినుసు.. ఇది వంటకు రంగుతో పాటు రుచికరంగా కూడా చేస్తుంది. అందుకే ఒక సూపర్‌ఫుడ్ అంటారు. ఇది క్యాన్సర్‌తో పోరాడి డిప్రెషన్‌ని తగ్గిస్తుంది. పసుపులో ఉండే అనేక సమ్మేళనాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది కర్కుమిన్. ప్రతి రోజూ ఉదయాన్నే పసుపు నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తరచుగా జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు పసుపు నీటిని తీసుకోవటం వల్ల ఫలితం ఉంటుంది. దీంతో మీరు ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండగలరు. పసుపు అనేది విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలతో సమృద్ధిగా ఉండే సూపర్ ఫుడ్. ఈ అంశాలన్నీ మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుండి మనలను రక్షిస్తాయి. ఇది శరీరాన్ని లోపలి నుండి వెచ్చగా ఉంచుతుంది. శక్తితో నిండి ఉంటుంది. మరీ ముఖ్యంగా శీతాకాలంలో టర్మరిక్ డ్రింక్ తాగడం ద్వారా ఫిట్‌గా ఉండొచ్చు. దాని ప్రయోజనాలు, ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

ఇవి కూడా చదవండి

– 1 టీస్పూన్ పసుపు పొడి

– 2 కప్పుల నీరు

– 1/2 టీస్పూన్ సొంపు

– 1 అంగుళం అల్లం

– 1 స్పూన్ తేనె

– కొద్దిగా నిమ్మరసం

తయారీ విధానం..

ముందుగా నీటిని మరిగించాలి. తర్వాత అందులో పసుపు, సోంపూ, అల్లం ముక్క వేయాలి. 5 నుండి 7 నిమిషాలు మంట తగ్గించి మరిగించాలి. కాస్త చల్లరిన తర్వాత ఇప్పుడు దానికి తేనె, నిమ్మరసం కలపండి. గోరువెచ్చగా, కావాలంటే వేడిగా ఉండగానే తాగేయొచ్చు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ వేడి పసుపు పానీయం తాగితే, ఫిట్‌గా ఉండవచ్చు. దీంతో లాభాలేంటో తెలుసుకుందాం ..

రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

ఏ కాలంలోనై జలుబు, దగ్గు, జ్వరం, కీళ్ల నొప్పులు వంటి వ్యాధులు రావడం సర్వసాధారణం. జలుబు, కాలుష్యం కారణంగా మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. కానీ జలుబు, దగ్గు వంటి వ్యాధులను నివారించడానికి పసుపుతో తయారు చేసిన వేడి పానీయం అత్యంత ప్రభావవంతమైన హోం రెమెడీగా పనిచేస్తుంది. పసుపులో మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే కర్కుమిన్, జింక్, విటమిన్ సి వంటి అంశాలు ఉన్నాయి. అందుకే, చలికాలంలో ప్రతిరోజూ పసుపు పానీయాన్ని తాగండి. ఇది మిమ్మల్ని వ్యాధుల నుండి సురక్షితంగా ఉంచుతుంది.

పసుపులోని కర్కుమిన్ అనే పదార్థం శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. ఫ్రీ రాడికల్స్ కణాలను నష్టపరిచి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. పసుపు గాయం, కండరాల ఒత్తిడి లేదా కీళ్ల నొప్పుల నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. పసుపులోని కర్కుమిన్ మెదడులోని నరాల మార్గాలను రక్షించడానికి మెమరీ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ సెన్సెటివీ పెరుగుతుంది. స్త్రీలల్లో వచ్చే నెలసరి నొప్పి కూడా తగ్గుతుంది.

గ్యాస్, తిమ్మిర్లు, మంట, అజీర్ణం మొదలైన కడుపు సంబంధిత సమస్యలను కూడా మీరు తరచుగా ఎదుర్కొంటున్నారా? కాబట్టి పసుపు మీకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. పసుపులో అనేక రకాల యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కడుపులోని చెడు బ్యాక్టీరియాను చంపి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అన్ని రకాల కడుపు సంబంధిత సమస్యలలో పసుపు ప్రయోజనకరంగా ఉండటానికి ఇదే కారణం. పసుపు నీళ్లు పెయిన్ కిల్లర్ గా కూడా పని చేస్తుంది. దీని తాగడం వల్ల తలనొప్పి, కండరాల నొప్పులు తగ్గుతాయి.

పసుపు చెడుగు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. పసుపులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి వాపు సంబంధిత సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తాయి. పసుపులోని యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేయడంలో చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. పసుపు నీటిలోని నిర్విషీకరణ లక్షణాలు శరీరం నుంచి విష పదార్థాలను తొలగించి, మొత్తం శుభ్రపరిచే ప్రక్రియను మెరుగుపరుస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..