- Telugu News Photo Gallery Amazing Health Benefits With Sweet Potatoes If You Add In Your Diet Telugu Lifestyle News
Sweet Potato: చుక్కనూనె లేకుండా స్వీట్ పోటాటో.. ఇలా తింటే మీ గుండె పదిలం.. యవ్వనంగా ఉంటారు..!
Sweet Potato Benefits: శివరాత్రి స్పెషల్ చిలగడదుంపలు. దీనినే కందగడ్డ, స్వీట్‌పోటాటో అని కూడా అంటారు. మహాశివరాత్రి ఉపవాస దీక్షలో ఉన్నవారు తప్పనిసరిగా దీనిని తింటారు. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. స్విట్‌పోటాటోతో శరీరంలో ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్, పొటాషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ పోషకాల నిధినిగా పరిగణించే స్వీట్‌పోటాటోను మీ డైట్లో తప్పనిసరిగా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Updated on: Mar 08, 2024 | 5:05 PM

చిలగడదుంపలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది కంటి ఆరోగ్యానికి మంచిది. కేరల్ మాదిరి చిలగడ దుంప కూడా కంటిచూపు మెరుగ్గా ఉండటానికి దోహదం చేస్తుంది. రక్తపోటుతో బాధపడేవారు చిలగడ దుంపను తమ తమ రోజూ వారి ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.ఎందుకంటే ఇందులో ఉండే పొటాషయం గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది కీళ్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుది.

చాలావరకు మనం చిలగడ దుంపను నీళ్లలోనే ఉడికించుకుని తింటాం. కాబట్టి ఇందులో ఆయిల్ వాడం. అందుకే ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. అధిక మొత్తంలో ఉండే ఫైబర్ త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. మలబద్ధకం సమస్య కూడా ఉండదు. బరువు తగ్గించుకోవాలని ప్రయత్నించేవారు చిలగడదుంపను వాడితే ఫలితం ఉంటుంది.

చిలగడ దుంపలో ఐరన్, ఫోలేట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీంతో అనీమియా సమస్య ఉండదు. రక్తహీనతతో బాధపడేవారు తమ డైట్లో చిలగడ దుంప ఉండేలా చూసుకోండి.ముఖ్యంగా ఎముకలు బలహానంగా ఉండేవారు చిలగడ దుంపను తమ ఆహారంలో చేర్చుకోవాలి.

చిలగడదుంపలో ఉండే కెరటనాయిడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ తో బాధపడేవారు చిలగడదుంపను తినవచ్చు. దీంతో ఇందులో ఉండే పోషకాలు వారికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.

స్వీట్‌పోటాటోతో కేవలం ఆరోగ్యపరంగానే కాదు, అందానికి కూడా అనేక లాభాలనిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సీ కొల్లాజెన్ ఉత్పత్తికి ప్రోత్సహిస్తుంది. దీంతో మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. చిలగడదుంప వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది. దీంతో మీ ముఖం, చర్మం అందంగా మెరిసేలా కనిపిస్తుంది.





























