ప్రసవవేదనను మించిన వేదన.. మహిళా దినోత్సవం సందర్బంగా ప్రత్యేక ర్యాలీ
వాళ్ళంతా ఆదివాసి మహిళలు. కొండకోనల్లో వారి జీవనం. కనీస సౌకర్యాలు వారికి ఆమడ దూరం. ఆనారోగ్యల సమయంలో వారి జీవితం అగమ్య గోచరం. మహిళ గర్భిణీ అయితే.. ఆమె కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బిడ్డ కడుపులో పడితే.. కాన్పు వరకు ప్రాణాలు ఉంటాయా.. గాల్లో కలుస్తాయా అన్న ఆందోళన. ఎందుకంటే.. ఆసుపత్రికి వెళ్లాలంటే వాహనాలు రావు. రోడ్లు సరిగా లేక.. వాహనాలు రాక ఇక డోలి కట్టాలసిందే. ఎన్నిసార్లు మోరపెట్టుకున్నా సమస్య తీరక పోవడంతో ఇక ఆ గిరిజన మహిళలు రోడ్డెక్కారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
