Almonds Benefits: భోజనానికి ముందు బాదం తింటే ఇన్ని ప్రయోజనాలా? సంచలన అధ్యయనంలో నివ్వెరపోయే వాస్తవాలు

బాదం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో? అని ఇటీవల కాలంలో చేసిన చేసి అధ్యయనం నివ్వెరపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ముఖ్యంగా బాదంపప్పును భోజనానికి ముందు తింటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయని తేలింది.

Almonds Benefits: భోజనానికి ముందు బాదం తింటే ఇన్ని ప్రయోజనాలా? సంచలన అధ్యయనంలో నివ్వెరపోయే వాస్తవాలు
Badam
Follow us
Srinu

|

Updated on: Mar 22, 2023 | 4:45 PM

భారత్‌లో కరోనా తర్వాత బాదంపప్పుల వినియోగం బాగా పెరిగింది. కరోనా నుంచి రక్షణ కోసం పోషకాహారాన్ని తినాలని వైద్యులు సూచించడంతో ఎక్కువ మంది డ్రైఫ్రూట్స్ వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా బాదం పప్పు కచ్చితంగా రోజువారీ డైట్‌లో చేర్చుకున్నారు. కరోనా సమయంలో బాదం ఉపయోగాలు తెలుసుకున్న అంతా బాదం పప్పును మాత్రం డైలీ తింటూనే ఉంటున్నారు. అయితే బాదం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో? అని ఇటీవల కాలంలో చేసిన చేసి అధ్యయనం నివ్వెరపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ముఖ్యంగా బాదంపప్పును భోజనానికి ముందు తింటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయని తేలింది. భోజనానికి 30 నిమిషాల ముందు దాదాపు 20 గ్రాముల బాదంపప్పు తింటే పోస్ట్ ప్రాండియల్ హైపర్ గ్లైసేమియా లేదా గ్లూకోజ్ స్పైక్ గణనీయం తగ్గుతుందని వెల్లడైంది. అలాగే ఇన్సులిన్ స్థాయిలు కూడా మెరుగుపడ్డాయి. ప్రీడయాబెటిస్‌ ఉన్న వారు బాదంపప్పు తినడం వల్ల ప్రయోజనకరమైన ప్రభావాలను పొందుతారని నివేదికలో వెల్లడైంది. 

రోజుకు ఎన్ని బాదంపప్పులు తినాలి?

సాధారణంగా అంతా రోజుకు 5 నుంచి 6 బాదంపప్పులను తింటూ ఉంటారు. అయితే ఇది మానవ శరీరానికి చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. ఓ ఆరోగ్యకరమైన మనిషి రోజు 20 గ్రాముల బాదంపప్పు తినాలని పేర్కొంటున్నారు. అంటే రోజుకు 17-18 బాదంపప్పులను తినాలి.

అధ్యయనం ఇలా

ఈ అధ్యయనం కోసం 27 మంది పురుషులు, 33 మంది స్త్రీలను ఎంచుకుని పరీక్షలు చేశారు. మధుమేహం, తీవ్రమైన అంటు వ్యాధులు, ప్యాంక్రియాటైటిస్ చరిత్ర, మూత్రపిండ, కాలేయ వ్యాధి, అనియంత్రిత రక్తపోటు, హైపోథైరాయిడిజం వంటివి వారిని అధ్యయనం నుంచి మినాహాయించామని పరిశోధకులు చెబుతున్నారు. బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు 30,60,90,120 నిమిషాలకు ప్రీ మీల్ ఆల్మండ్ లోడ్ ట్రీట్‌మెంట్ డైట్ వర్సెస్ కంట్రోల్ డైట్‌కు గణనీయం తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. రక్తంలో గ్లూకోజ్, సీరం ఇన్సులిన్, ప్లాస్మా గ్లూకాగాన్, సీరం-సిపెప్టైడ్‌లలో గణనీయమైన తగ్గుదల చూపించింది. ప్రీమీల్ బాదంలోడ్ కారణంగా 75 గ్రామలు నోటి గ్లూకోజ్ లోడ్ ద్వారా ప్రేరేపించిన ఇన్సులిన్ విడుదల కంటే 30 నిమిషాల ముందుగానే నిల్వ చేసి ఇన్సులిన్ ప్రేరేపిస్తుందని అధ్యయనంలో తేలింది. బాదం పప్పులోని ఫైబర్ పేగుల విషయాల్లో స్థిరత్వాన్ని పెంచుతుంది. అలాగే గ్లూకోజ్ వ్యాప్తిని అరికడుతుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందని పరిశోధనల్లో తేలింది. 

ఇవి కూడా చదవండి

పచ్చి బాదంతో మరింత మేలు

సాధారణంగా బాదంపప్పును నాణబెట్టి తొక్క తీసి తింటూ ఉంటారు. అయితే పచ్చి బాదం పప్పును తింటే మరింత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పు పచ్చిగా తింటే అందులోని పోషకాలు చెదిరిపోవని నిపుణులు సూచిస్తున్నారు. నానబెట్టిన బాదం యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాన్ని తగ్గిస్తుంది. అలాగే తొక్క కింద ఉన్న పోషకాలు కూడా తగ్గిపోతాయనినిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బాదంపప్పును తింటే ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గడంతో గుండె జబ్బుల సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.