Best Foods for Healthy Skin: అందాన్ని పెంచుకునేందుకు చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఏవేవో ఫేస్ ప్యాక్‌లు, క్రీములు రాస్తూ అందం కోసం శ్రమిస్తుంటారు. అయితే.. ఆహారంతో ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంచుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఆహారం ద్వారా లభించే పోషకాలు చర్మాన్ని తళుక్కుమనేలా చేస్తాయి. అలాంటి ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1 / 6
అవకాడో.. ఈ అవకాడోలో ఆరోగ్యకరమైన నూనెలు, విటమిన్ ఇ రెండూ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి చర్మ కణాలను సమర్థంగా పనిచేసేందుకు దోహదపడతాయి.
2 / 6
Badam
3 / 6
క్యారెట్.. వీటిలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ప్రొటీన్ తయారీకి ఉపయోగపడి.. చర్మాన్ని దృఢంగా, మృదువుగా మారుస్తుంది.
4 / 6
పాలకూర.. మెరిసే చర్మం కావాలనుకుంటే పాలకూర తప్పనిసరిగా ఆహారంలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే విటమిన్ ఎ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు అన్ని రకాల స్కిన్ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి. దీనిలోని ఐరన్ రక్త హీనతను నివారించి.. మరింత అందాన్నిస్తుంది.
5 / 6
గ్రీన్ టీ.. గ్రీన్ టీలో ఉండే.. యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతి వంతం చేస్తాయి. అంతేకాదు ముడతలు కూడా తొలిగిపోతాయి.